యూట్యూబ్ లో వున్న ‘పంజా’ వంద వ్యూస్ నావే...అల్లు శిరీష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ స్కేల్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం పవన్ మునుపటి సినిమాలకంటే కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో మెగా అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. ఈ అల్బమ్ లో పంజా టైటిల్ సాంగ్ కి శ్రోతల నుండి మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తుంది.
ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన రావడంతో ఈ సినిమాకి ఇంతకు ముందున్న క్రేజ్ ఇప్పుడు అమాంత పెరిగిపోయింది. ఈ సినిమాకి ఫిలిం సర్కిల్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తుండటంతో ఈ సారి పవన్ బంపర్ హిట్ రికార్డులన్నీ తిరగరాస్తాడని మెగా అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కాగా ఈ చిత్రం ఆడియోపై రీసెంట్ గా రామ్ చరణ్ చైనాలో షూటింగ్ లో ఉంటూ పంజా సాంగ్స్ రాకింగ్ అంటూ ట్వీట్ చేసారు. ఇప్పుడు అల్లు శిరీష్ కూడా పంజా గురించి చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నానంటున్నాడు
నా దృష్టిలో 'తీన్ మార్' సినిమా హిట్టే. ఎందుకంటే మాస్ కు అర్ధం కాని సౌత్ ఆఫ్రికాలో జరిగే కథ. రెండవది తెలుగు క్లాస్ ప్రేక్షకులకు నచ్చని సబ్జక్ట్ వలన 'తీన్ మార్' సినిమా తెలుగు ప్రేక్షలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. నా దృష్టిలో 'తీన్ మార్' సినిమా హిట్టే అని ఎందుకు అంటున్నాను అంటే, సినిమాలో నాకు పూర్వపు ఉషారైన పవన్ కళ్యాణ్ కనిపించాడు. ప్రత్యేకమైన దృష్టి పెట్టి సినిమా చేసినట్టుగా అనిపించింది. ఒక్క సీనులో కూడా డల్ గా కనిపించలేదు.
ఈ పంజా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఉషారు చూసాక సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అన్న ఆత్రుత మొదలైంది. బ్యాక్ టు తమ్ముడు రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఫుల్ మీల్స్ ఫర్ పవన్ ఫ్యాన్స్ గ్యారంటీ. యూట్యూబ్ లో వున్న వంద వ్యూస్ నావే అయివుంటాయి అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











