పవన్ ‘పంజా’ ఖచ్చితంగా సూపర్ మెగా బ్లాక్ బస్టర్ అవుతుంది: అంజలీ
కింగ్ ఫిషర్ క్యాలెండర్ బికినీ మోడల్ అంజలీలావెనీయా. పంజా చిత్రంతో పరిచయమవుతున్న హీరోయిన్ అంజలి లావానియా ఈ సినిమాతో తెలుగునాట సెగలు రేపడం ఖాయమని చెప్తోంది. ఈ చిత్రంలో ఆమెపై ఓ సోలో సాంగ్ చిత్రీకరించారని సమాచరం. ఎలాంటి హాట్ సాంగ్ అయినా కానీ చిన్నబోయే విధంగా ఈ చిత్రంలో ఆ పాట ఉంటుందని అంజలి చెప్తోంది. ఈ పాట చూస్తే ఎవరైనా ఊపిరి తీసుకోవడం మరిచిపోతారని అంటోంది. మోడల్ గా బాగా పేరు తెచ్చుకున్న అంజలి ఈ చిత్రంలోని పాత్రకి కరెక్ట్ గా సరిపోయిందని దర్శకుడు విష్ణువర్థన్ కూడా చెబుతున్నారు.
బాలీవుడ్ కత్రినాకైఫ్ తో షీలా కీ జవానీ...అంటూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా డాన్స్ సమకూర్చిన గీతా కపూర్ సారద్యంలో ఇటీవలె ఆమె చెబుతున్న హాట్ సాంగ్ ని పూర్తి చేసారని సమాచారం. కత్రినా పాటకంటే గీత ఈ పాటకి అంతకంటే అద్దిరిపోయే డాన్స్ సమకూర్చారని సమాచారం. స్వతహాగా బెల్లీ డాన్సర్ అయిన అంజలి లావానియా ఈ పాటలో తన టాలెంట్ మొత్తం చూపించిదట.
ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడే విధంగా పవర్ ఫుల్ స్టోరీ, కామెడీ, రొమాన్స్ యాక్షన్ తో పాటు పంజా కోసం వేచి చూసేందుకు మరో సెక్సీయస్ట్ సాంగ్ ఒకటి యాడ్ అయింది కదూ..అందుకే అంజలీ కూడా పంజా మరో మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెబుతోంది.


Click it and Unblock the Notifications











