మహేష్ బాబు హీరోయిన్ పవన్ వైపు చూస్తోంది
మహేష్ బాబు దూకుడు సినిమాలో నటించి హీరోయిన్ సమంత తాజా తన చూపులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు మరల్చింది. ఎలాగైనా సరే ఆయనతో సినిమా చేసి తెలుగులో టాప్ పొజిషన్ ఖాయం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం మొదులు పెట్టింది. పవర్ స్టార్ తాజా సినిమా పంజా సినిమాకు విడుదల ముందే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సమంత చేసిన ప్రకటన అందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది.
పంజా సినిమాపై సమంత మాట్లాడుతూ...'' ఎక్కడ చూసినా పంజా మేనియానే కినిపిస్తోంది, పవర్ స్టార్ పవర్ ఏమిటో నాకు ఇప్పుడే తెలుస్తోంది, ఇలాంటి స్టార్ తో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకోవడం సహజమే. నేను కూడా పవన్ తో నటించే అవకాశం దక్కాలని కోరుకుంటున్నా"" అంటూ పేర్కొంది. అయితే సమంత చేసిన ఈ ప్రకటన వెనక చాలా పెద్ద ప్లానే ఉందంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం సమంత చేతిలో పెద్ద హీరోల సినిమాలు లేవు. మున్ముందు పరిశ్రమలో తన స్థానం కాపాడు కోవడానికి ఇప్పటి నుంచే పెద్ద హీరోలను కాక పడుతోందని అంటున్నారు.
ఏది ఏమైనా... సమంత లాంటి అందగత్తె పవన్ తో నటించాలని ఇటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి సమంత కోరిక, అభిమానుల ఆశ తీరే సమయం ఎప్పుడు వస్తుందనే కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











