స్టయిలిష్..బట్ ఫ్యాన్స్ హర్ట్! (పంజా ఎలా ఉందంటే..?)

By Bojja Kumar

పంజా సినిమా కథ ఎలా ఉంది? సినిమా బాగుందా? లేదా? అనే విషయం పక్కన పెడితే....పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టయిలిష్ గా అదరగొట్టాడు. మార్నింగ్ షో చూసిన చాలా మంది అభిమానుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, సినిమా అంచనాలకు తగిన విధంగా లేక పోయినా, పవన్ కల్యాన్ స్టయిల్ మాత్రం అదిరి పోయిందంటున్నారు. యాక్షన్స్ సన్నివేశాల్లో పవన్ స్టార్ ఇరగ దీశాడని, డాన్సుల విషయంలోనూ పవన్ స్టార్ దుమ్ము రేపాడని అంటున్నారు. అయితే సినిమా తమకు నచ్చక పోవడానికి పూర్తిగా దర్శకుడి తప్పే అంటున్నారు. సినిమాను పూర్తిగా యాక్షన్ కోణంలో చూపించడం, వినోదానికి, కామెడీకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తీయడంలో దర్శకుడు విష్ణు వర్ధన్ పూర్తిగా విఫలం అయ్యారనే వాదన వినిపిస్తోంది.

సారా జేన్ డియాస్ యాక్షన్ ప్రెట్టీగా, ఆకట్టకునే విధంగా ఉందని చెప్పారు. అదే విధంగా అంజలి లవానియా చిన్న పాత్రే అయినప్పటికీ గ్లామర్ తో ఆకట్టుకుందని అంటున్నారు. ఇక ఉన్మాది, సైకో పాత్రలో అడవిశేష్ కు మంచి మార్కులే వేశారు చాలా మంది. అయితే మెయిన్ విలన్ జాకి ష్రాఫ్ మాత్రం ఏదో అలా మమ అనిపించాడట. ఇక పరుచూరి మురళి, తనికెళ్ల భరణి వారివారి పాత్రలమేరకు రాణించారని అంటున్నారు. తొలి సగంలో అలీ కాస్త నవ్విస్తే, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రేక్షకులకు వరుస యాక్షన్ సన్నివేశాల నుంచి కాస్త రిలాక్స్ ఇస్తుందన్నారు. పాటల చిత్రీకరణ బాగుందని చెప్పారు. ఈ మాత్రం వినోదం ఉంది కాబట్టి థియేటర్లో ఉండగలిగాం, లేక పోతే ఎడతెరిపిలేని ఆ తుపాకల మొత మధ్య థియేటర్లో మూడు గంటలు వెల్లదీయండం చాలా కష్టం అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X