మహేష్, ఎన్టీఆర్ లపై వ్యాఖ్యలతో పంజా..వివాదం
మా స్పీడుకి ఇండస్ట్రీలో బ్రేక్ వెయ్యిలేకపోయాడు..క్షణానికో రంగు మార్చే మీ దూకుడెంతరా అంటూ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ప్లెక్లీలపై రాయటం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. విజయవాడ కృష్ణలంకలో ఏర్పాటు చేసిన ఈ ప్లెక్లీలపై రాసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటు ఎన్టీఆర్ అభిమానులను,అటు మహేష్ అభిమానులను హర్ట్ చేస్తున్నాయి. క్షణానికో రంగు మార్చే అంటూ ఎన్టీఆర్ ఊసరవెల్లిని గుర్తు చేయటం, మీ దూకుడు ఎంతరా అని డైరక్ట్ గా మహేష్ దూకుడుని సవాల్ చేయటం ఇబ్బంది కరంగా మారింది. అంతేగాక తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు మాకు లేదు.
అలాగే మేము సృష్టించే చరిత్రలే భావి తరాలకు భగవద్గీత అని మరో హోర్టింగ్ పై రాసారు. ఇంతేకాక పవన్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి తాము ముందంటే..తాము ముందు ప్లెక్సీ పెడతామని వివాదం మొదలెట్టారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసారు. సంఘటన స్దలంలో ఉన్న తమని అనవసరంగా అరెస్టు చేస్తున్నారని, తమకూ గొడవకూ ఏ సంభందం లేదని అభిమానులు ఆవేదనతో మీడియాతో చెప్తున్నారు. విజయవాడ విజయకృష్ణా ధియేటర్ దగ్గర ఈ వివాదం ప్రారంభమైంది. అయితే ఇద్దరూ పవన్ ప్యాన్స్ కు చెందిన వారైనా అక్కడ వేరు వేరు పొలిటికల్ పార్టీలు సపోర్టు చేయటంతో వివాదం వేడిక్కింది. ప్రస్తుతం పోలీసులును ఇరు వర్గాలను విచారిస్తున్నారు. ఈ ప్లెక్సీ వివాదం వెనక ఏ పొలిటకల్ పార్టీ ఉందనే విషయాలను పోలీసులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











