ఫన్..జా(పవన్ 'పంజా' ప్రివ్యూ)

By Srikanya

లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన తీన్ మార్ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన పంజా ఓ స్టైలిష్ ఎంటర్టైర్. ఈ చిత్రం ఈ రోజే(డిసెంబర్ 9)విడుదల అవుతోంది. తమిళంలో భిళ్లా వంటి స్టైలిష్ చిత్రాలు రూపొందించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ జై అనే మాఫియా గ్రూప్ మెంబర్ గా కనిపిస్తాడు. ఫ్యామిలీ రివేంజ్ బ్యాక్ డ్రాప్ ని కలుపుకుని కలకత్తా మాఫియా నేపధ్యంలో ఈ చిత్రం జరుగుతుంది.అయితే చిత్రం మాఫియా నేపధ్యమైనా చాలా కామిడీగా నడుస్తుంది.సెకండాఫ్ లో బ్రహ్మానందంతో పవన్ చేసే విన్యాసాలు కడుపుబ్బానవ్విస్తాయి

'చురచురచూసే చూపు... అతని ప్రవర్తన, అతనిలో ఫైర్‌' కలిపి ఈ పంజా టైటిల్‌కు సరిపోతాయి.అలాగే చిత్రం కథలో అంతర్లీనంగా దేశభక్తి అంశం కూడా ఉంటుంది. పాత్ర పేరు జయదేవ్‌ షాట్‌కట్‌లో 'జై' అంటారు. విలన్స్ గా జాకీష్రాఫ్‌, అడవి శేషు కనిపిస్తారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. పాపారాయుడు పాట చాలా ఫేమస్‌ అయింది. చిత్ర రీరికార్డింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది .'పంజా'అనగానే పులి పంజా అనుకుంటారు ఎవరైనా. కానీ ఇందులో పవన్‌కల్యాణ్‌ పవర్‌, వ్యవహారశైలి వంటి అంశాలకు సింబాలిక్‌గా పెట్టిన టైటిల్‌ ఇది.

హైలెట్స్...పవన్ కళ్యాణ్ మొదటి సారిగా గెడ్డం తో కొత్త లుక్ తో కనపించటం.అలాగే అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బ్రహ్మానందంపై వచ్చే స్పెషల్ పాట. అంతేగాక అంజలీ పై చిత్రీకరించిన బెల్లీ డాన్స్,దర్సకుడు స్టైలిష్ టేకింగ్. పవన్ కళ్యాణ్ మార్క్ ఫైటింగ్ లు ..అంటే ఖుషీ,జానీ తరహాలో న్యాచురల్ ఫైటింగ్ లు చిత్రంలో కనిపిస్తాయి. అన్నిటికీ తోడు అబ్బూరి రవి రాసిన డైలాగులు ఇప్పటికే అంతటా పాపులర్ అవ్వటం.

పాజిటివ్ పాయింట్స్...పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం. విపరీతమైన ఓపినింగ్స్ ఉండటం. దీనికితోడు పవన్ ఫ్యాన్స్..తమ హీరో దూకుడు రికార్డులు బ్రద్దలు కొట్టాలని ఎదురుచూడటం.

నెగిటివ్ పాయింట్స్ ...గతంలో పవన్ తో స్టైయిట్ (రీమేక్ కాదు)చేసిన బంగారం దర్శకుడు ధరణి,పులి చేసిన ఎస్ జె సూర్యల సినిమాలు ప్లాప్ కావటం. అలాగే దర్సకుడు విష్ణు వర్దన్ చిత్రం భిల్లా రీమేక్ తెలుగులో అంతగా వర్కవుట్ కాకపోవటం. ఈ సినిమాపై కొంతమందిలో అనుమానాలు రేపుతున్నాయి. అయితే ఇప్పటికే విపరీతమైన పాజిటివ్ టాక్ చిత్రంపై ఉండటంతో ఇవి అస్సలు నెగిటివ్స్ గా పరిగణించాల్సిన పనిలేదు.

సంస్ధ: సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్.
నటీనటులు: పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా, అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
కెమెరా: పి.ఎస్.వినోద్
ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్
యాక్షన్: శామ్‌కౌశల్
సంగీతం :యవన్ శంకర్ రాజా
ఆర్ట్: సునీల్‌బాలు
స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా
సంభాషణలు: అబ్బూరి రవి
స్టైలింగ్: అనూవర్థన్
నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X