పంజా పబ్లిక్ టాక్ తో పాజిటివ్స్ ఎక్కువ, నెగటివ్స్ తక్కవ అని తేలింది..సో..:)
పవన్ కళ్యాణ్ సినిమా పంజా చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రీమియర్ షోస్ గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ప్రదర్శించారు. వివిద షోస్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం బాగుందని అనిపిస్తోంది. ప్రథమార్థం చాలా బాగుందని అభిమానలు అంటుంటే, అన్నివర్గాల ప్రేక్షకులు కూడా సినిమా బాగుందని ఒప్పుకుంటున్నారు.
ద్వితీయార్థం కాస్త నెమ్మదించిందని, అయితే పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం కలిసి చిత్రం గ్రాఫ్ పడిపోకుండా కాపాడరని అంటున్నారు. కామెడీతో దర్శకుడు సినిమాకి ఊపు తేగలిగాడని చెబుతున్నారు. ద్వితీయార్థం యావరేజ్ నుంచి ఎబౌ యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా సినిమాకి యావరేజ్ నుంచి బాగుందనే టాక్ వినిపిస్తోంది. అభిమానులు పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడని సంబరపడుతున్నారు. తటస్థులు సైతం సినిమా బాగుందనే చెప్త్పున్నారు. ఇదే టాక్ ఆడియన్స్ నుంచి కూడా వస్తే కనుక సినిమా హిట్టనే అనుకోవచ్చు..
ఈ చిత్రంలో కొన్నిహైలెట్స్ మీకోసం....
పాజిటివ్ :
పవన్ కళ్యాణ్
హీరోయిన్ సారాజెన్ దియాస్, అంజలీలావెనీయా
సాంగ్స్ పిక్చరైజేషన్
దర్శకడు విష్ణువర్థన్ స్టైలిష్ టేకింగ్
పియస్ వినోద్ సినామటోగ్రఫీ
యువన్ శంకర్ రాజా సాంగ్స్
పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం క్రాకింగ్ కామెడి
నెగటివ్స్
థిన్ స్టోరీలైన్
డ్రాగింగ్ మూమెంట్స్
ల్యాక్ ఆఫ్ కామెడీ
సో పాజిటివ్స్ ఎక్కువ..నెగటివ్స్ తక్కువ...మరికొద్దిసేపట్లో మా రివ్యూ కోసం వేచి చూడండి...


Click it and Unblock the Notifications











