హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్న పంజా రీ-రికార్డింగ్ రేపటి నుండి..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవేవో ఎక్సపెట్ చేస్తాం. ఎక్సపెట్ చేసేవి కూడా హై రేంజ్‌లో వుంటాయి. ఆ అంచనాలు ఏ రేంజ్ లోకి వెళ్ళాయంటే "అసలు పవన్ కళ్యాణ్ నుంచి ఏమి ఎక్సపెట్ చేస్తున్నామో" తెలియనంత రేంజ్‌లోకి వెళ్ళిపొయాయి. విమర్శకులు కూడా చూడని కోణంలో అభిమానులు చూసి చిన్న చిన్న వాటికి కూడా డిస్సపాయింట్ అవుతూ వుంటారు. అభిమానుల రెస్పాన్స్ చూస్తుంటే మెగా అభిమానులలో నూతనోత్సాహన్ని నింపిన 'పంజా" ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
'ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది"" అని దర్శకుడు విష్ణువర్థన్ అంటున్నారు. పవర్‌స్టార్ అభిమానులకే కాక, ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆనందాన్ని పంచుతుందని ఆయన అన్నారు. ''కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది..
కాగా పంజా చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగం గా పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి రేపటి నుండి రీ - రికార్డింగ్ పనులు మొదలవుతాయి. చిత్రం ఆడియోను ఘనం గా ఈ నెల 19 వ తారీకున గచ్చిబౌలి లోని స్టేడియం లో జరపనున్నారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన అంజలి లావెనియా మరియు సారా జేన్ డయాస్ హీరోయిన్లు గా నటించారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్సకత్వం వహించారు. పంజా చిత్రాన్ని నీలిమ తిరుమల సెట్టి మరియు శోభు యార్లగడ్డ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 9 వ తారీకున భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్ బాబు.


Click it and Unblock the Notifications











