twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమనులారా ‘పంజా’పై పుకార్లు నమ్మొద్దు

    By Bojja Kumar
    |

    విడుదలకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'పంజా"పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని అంటున్నారు ఆ చిత్ర నిర్మాతలు. విడుదల తేదీ పోస్ట్ పోన్డ్ అయిందని దుష్ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నాం..అని స్పష్టం చేశారు నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, దేవినేని వెంకట్.

    సినిమా గురించి వారు మీడియాతో మాట్లాడుతూ.....పంజా సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మధ్య విడుదలైన పాటలకు శ్రోతల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాల్లోని పాటలకు భిన్నంగా, వైవిధ్యంగా 'పంజా' ఆడియో ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. సారాజేన్ డియాస్, అంజలీ లావానియా కథానాయికలుగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారన్నారు.

    పంజా సినిమాలో బ్రహ్మానందం, ఝాన్సీతో కలిసి పవన్ కనిపించే సన్నివేశాల్లో నవ్వులు పండుతాయి. ప్రతి ఫ్రేములోనూ దర్శకుడి ప్రతిభ మెప్పిస్తుంది. పవన్ గెటప్‌కు సర్వత్రా మంచి ఆసక్తి కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కనులపండువగా ఉంటాయి. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పంజా సినిమాను అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

    English summary
    Power star Pawan Kalyan's 'Panja' movie producers Tirumalashetty Neelima, Sobhu Yarlagadda have confirmed that their movie is releasing on December 9th worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X