భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య భారీగా రిలీజ్ కు ‘పంజా’ సిద్ధం...!
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా, సారజెన్ దియాస్, అంజలి లావెనాయా కథానాయికలుగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'పంజా' సినిమా డిసెంబర్ లో బారీగా విడుదలకు సంసిద్దమౌతోంది. వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే 'పంజా' సినిమా భారీ బడ్జెట్ మాత్రమే కాదు, పంజా టీం మొత్తం భారీగా కష్టపడినట్టు తెలుస్తుంది. స్టిల్స్, టైటిల్, ట్రైలర్స్ & ఆడియో.. అటు మాస్ లోను, ఇటు క్లాస్ లోను భారీ అంచనాలే క్రియేట్ చేసాయి. భారీ అంచనాలకు తగ్గట్టుగానే భారీ రిలీజ్ కి సిద్దం చేస్తున్నారు నిర్మాతలు. పంజా చిత్రంలోని ఆఖరి సన్నివేశానికి సంబందించిన చిత్రీకరణ నిన్నటికి పూర్తి అయ్యింది. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక చిత్ర నిర్మాతలు క్లాప్ బోర్డుపై సంతకం చేసారు.
ప్రస్తుతం పంజా చిత్ర రీరికార్డింగ్ మరియు ఫైనల్ మిక్సింగ్ పనులు చెన్నైలో జరుగుతున్నాయి. పంజాతో దర్శకుడు విష్ణు వర్ధన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జై అనే పాత్రలో కనిపించనున్నాడు. పంజా సినిమాలో సూపర్ యాక్షన్ వుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కామెడీ వుంది. ఇది ఓక లవ్ స్టోరి, పవన్ కళ్యాణ్ అయితే ఫైట్స్ ఇరగదీశాడు. స్టైలిష్ టేకింగ్... ఇవన్నీ ఒక వైపు అయితే, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో చేసాడు అంటున్నారు దర్శక నిర్మాతలు. సారా జేన్, అంజలి లావానియ, జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి మరియు అడివి షేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా సంఘమిత్ర ఆర్ట్స్ మరియు ఆర్కా మీడియా బ్యానర్ పై నీలిమ మరియు శోభు యార్లగడ్డ నిర్మించారు. పంజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 9న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











