ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్న ‘పంజా’లోని ఆ రెండు పాటలు...?!
పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా, అంజలి లావెనియా మరియు సారజెన్ దియాస్ కథానాయికలుగా నటించిన సినిమా 'పంజా" తక్కువ బడ్జెట్ లో విష్ణువర్థన్ దర్శకత్వంలో పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ లేటెస్ట్ వండర్ 'పంజా". ఇప్పుడు ఎక్కడ చూసినా 'పంజా" మానియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టిస్తున్న పవన్ డిసెంబర్ 9న తన 'పంజా" పవర్ ని బాక్సాఫీస్ మీద చూపించబోతున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పంజా ట్రైలర్ కు ఏలా డివైడ్ టాక్ వచ్చిందో, ఆడియో విషయంలో కూడా అలాగే ఫ్యాన్స్ నుంచి డివైడ్ టాక్ వస్తుంది. పంజా టైటిల్ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయ్యింది. దానితో పాటు బ్రహ్మానందం ఉన్న 'పాపారావు....." సాంగ్ కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. పవన్ స్టైల్ లో ఉండటమే ఈ సాంగ్ స్పెషల్ అని చెప్పాలి. అక్కడక్కడా వచ్చే బ్రహ్మి, పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ బిట్లు సాంగ్ హిట్ అవ్వడంలో కీలకం అని చెప్పాలి.
కాగా ఈ పాటకు సాహిత్యం కూడా అవసరమైనట్టు ఉంది. ఈ పాటలో పవన్ డ్యాన్స్ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. మరొకటి 'ఎలా ఎలా అంటూ...." సాగే సాంగ్ మంచి మెలోడీ. కాగా సినిమా రిలీజ్ అయిన తరువాత సినిమా రిజల్ట్ బట్టి ఈ సాంగ్ ఎ స్థాయిలో హిట్ అనేది ఆధారపడి ఉంటుంది. అనుకోలేదుగా అంటూ సాగే పాట మ్యూజిక్ లవర్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఆడియో ఓకే.
అయితే పవన్ సినిమాల ఆడియోలు సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. పంజా మాత్రం మూడు పాటలు మాత్రమే ఆ రేంజ్ లో ఉండటం ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే సినిమా హిట్ అయిన తరువాత సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











