సంచలన రికార్డ్ ను సొంతం చేసుకొంటున్న పంజా...!
పవన్ కళ్యాణ్ పంజా స్టడీగా దియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ్ డైరక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన పంజాకు మొదట్నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజ్ అయిన తరువాత రకరకాల టాక్ వినిపిస్తుంది. ఎ సెంటర్స్ లో డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకోగా, బి, సి సెంటర్స్ లో అంత పాజిటివ్ టాక్ లేదు. పంజా కలెక్షన్స్ విషయంలో కూడ సంచలన రికార్డులు సొంతం చేసుకుంటుందని అనుకున్నారు.
అయితే ఈ విషయంలో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ద బిజినెస్సే చేసిందంటున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇప్పటి వరకూ పంజా మంచి బిజినెస్సే చేసిందని, పవన్ కళ్యాణ్ గత చిత్రం తీన్ మార్ తో పోలిస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ తో పంజా బాగా రాబడుతోందని అంటున్నారు. అదేవిధంగా రీసెంట్ విడుదలైన మహేష్ బాబు చిత్రం దూకుడు, జూ ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లితో పోల్చుతూ ఈ రెండు చిత్రాలకంటే ఎక్కువగా గానే పంజా ఓపెనింగ్స్ రాబట్టిందిని సమాచారం. దీని ప్రకారం పంజా మూడు రోజుల కలెక్షన్స్ వివారల్లో కి వెలితే...సినిమా బడ్జెట్ 33కోట్లు, ఓపెనింగ్ థియేటర్స్ 1800. ప్రపంచ వ్యాప్తంగా 8000 షోష్ తో విడుదలైన పంజా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ :
ఫస్ట్ డే(శుక్రవారం) : 16.2కోట్లు (ప్రీమియర్ షోష్ తో కలిపి)
సెకండ్ డే(శనివారం): 10.1కోట్లు
థర్డ్ డే(ఆదివారం): 8.2కోట్లు
మొత్తం మూడు రోజుల గ్రాస్ కెలెక్షన్స్ రూ. 34.5కోట్లు(అప్రాక్సిమేట్ గా)


Click it and Unblock the Notifications











