అంతా షాక్ : ‘పంజా’కు A సర్టిఫికెట్
పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'పంజా' మరో రెండు రోజుల్లో డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత మూడు రోజుల క్రితమే సెన్సార్ పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంతా భావించా....అందరినీ షాక్ కు గురి చేస్తూ సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు పెద్దలు మాత్రమే చూడతగినది అంటూ..'A'సర్టిఫికెట్ జారీ చేశారు. వాస్తవానికి సెన్సార్ బోర్డు వారు కొన్ని కత్తెర్ల అనంతరం U/A సర్టిఫికెట్ ఇవ్వాలని చూశారు, అయితే పంజా దర్శక నిర్మాతలు కత్తెర్లకు ఒప్పుకోక పోవడంతో సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు.
దీంతో 'పంజా' కేవలం పెద్దల వర్గానికి మాత్రమే పరిమితం అయిందని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పవన్ అభిమానులకు ఈ సినిమా చూసే హక్కు లేక పోవడం సర్వత్రా చర్చీనీయాంశం అయింది. సెన్సార్ బోర్డు వారు ఈ సర్టిఫికెట్ జారీ చేశారంటే...మితిమీరిన హింస, శృతిమించిన శృంగార సన్నివేశాలు గానీ ఈ సినిమాలో ఉన్నాయా? అనే అనుమానాలకు తావిచ్చినట్లయింది.
అయినా ఈ కాలంలో, ముఖ్యమంగా మన రాష్ట్రంలో A సర్టిఫికెట్ ను ఎవరు పట్టించుకుంటున్నారు? మగధీర లాంటి సినిమాలకు A సర్టిఫికెట్ వచ్చినా....కుటుంబ సమేతంగా చూశారు. ఇప్పడు పంజా విషయంలో అదే జరుగుతుందని, A సర్టిఫికెట్ ఉన్నా...పెద్దగా పోయేదేం లేదని పంజా దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాకు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. సారా జేన్ డియాస్, అంజని లవానియాలు హీరోయిన్లు, నిర్మాతలు శోభు యార్లగడ్డ, నీలిమా తిరుమలశెట్టి, ప్రసాద్ దేవినేని, నగేష్ ముంతా, సంగీతం : యువన్ శంకర్ రాజ


Click it and Unblock the Notifications











