twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా'ఆరు కట్స్ తో సెన్సార్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా' సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకి ఆరు కట్స్ తో U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం డ్యూరేషన్ 180 నిముషాలు అనగా మూడు గంటలు నిడివి ఉంది. ఇక ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, దేవినేని వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలయ్యాయి.

    ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ "ఇప్పటి వరకూ వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాల్లోని పాటలకు భిన్నంగా, వైవిధ్యంగా 'పంజా' ఆడియో కుదిరింది. అందరూ మెచ్చుకుంటున్నారు. యువన్ సంగీతం హుషారుగా ఉంది. సారాజేన్ డియాస్, అంజలీ లావానియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు. హేమాహేమీలనదగ్గ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంటుంది.

    బ్రహ్మానందం, ఝాన్సీతో కలిసి పవన్ కనిపించే సన్నివేశాల్లో నవ్వులు పండుతాయి. ప్రతి ఫ్రేములోనూ దర్శకుడి ప్రతిభ మెప్పిస్తుంది. పవన్ గెటప్‌కు సర్వత్రా మంచి ఆసక్తి కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కనులపండువగా ఉంటాయి. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న 'పంజా'ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం'' అని తెలిపారు.

    English summary
    Panjaa- the film of Pawan Kalyan has completed Censor formalities and the film is awarded with U/A certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X