నిర్మాతల ముఖాముఖి-‘పంజా’ A to Z డిటైల్స్

By Bojja Kumar

పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా విష్ణువర్థన్ దర్శకత్వంలో సంఘమిత్ర ఆర్ట్, ఆర్కామీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పంజా'. ఈ సినిమా గురించి వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు, యువత చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజా సినిమా గురించి వివరాలు ఇప్పటికే చాలా సార్లు వెబ్ సైట్లలో వచ్చిననప్పటికీ అందులో అన్ని అంశాలు దర్శక నిర్మాతలు ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉన్న అనుమానాల్ని తొలగించేందుకు, పంజా గురించి వివరాల్ని తెలియ జేసేందుకు నిర్మాతలు శోభు యార్లగడ్డ, నీలిమా తిరుమలశెట్టి, ప్రసాద్ దేవినేని, నగేష్‌ ముంతా మీడియాతో ఫేస్ టు ఫేస్ సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

పంజా సినిమాను డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత సినిమా వివరాలను గురించి వెల్లడిస్తూ....''పవన్ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం వెనక చాలా పెద్ద కథే ఉంది. తొలుత సినిమా చేద్దామని అనుకున్నప్పడు దర్శకుడి ఎంపిక జరుగలేదు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత విష్ణువర్ధన్‌ అయితే బాగుంటుందని పవన్ అన్నారు. ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నిర్మాణ పరంగా కొత్తవారే న్యాయం చేయగలరని పవన్‌కల్యాణ్ మాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం దక్కడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

కోల్‌కత్తా నేపథ్యంలో మాఫియా బ్యాక్‌వూడాప్‌లో నడిచే ప్రేమ కథా చిత్రమిది, ఇందులో ఆయన జైదేవ్ పాత్రను పోషించారు. యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్లలో వుంటాయి. . కథానుగుణంగా 'పంజా' అనే టైటిల్‌పెట్టాం. దర్శకుడు విష్ణువర్ధన్ మొదట ఈ చిత్రానికి 'షాడో' అనే టైటిల్‌ను సూచించారు. అయితే ఈ చిత్రంలో కథానాయకుడు పవన్‌కల్యాణ్ దృక్పథాన్ని ప్రతిబింబించేలా సింబాలిక్‌గా వుంటుందని 'పంజా' అని టైటిల్ నిర్ణయించామన్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు వినోదం కూడా సమపాళ్లలో వుంటుంది. మొదటి అర్థభాగమంతా అలీ, రెండో భాగమంతా బ్రహ్మానందం వినోదాన్ని పండిస్తారు. దర్శకుడు విష్ణువర్థన్ స్టైలిష్‌గా సినిమాని తెరకెక్కించాడు. విజువల్‌గా ప్రతీ ఫ్రేమ్ చాలా గ్రాండ్‌గా వుండేలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ మెయిన్ విలన్ పాత్ర చేయగా, అడివి శేష్ మరో విలన్‌గా కనిపిస్తాడు. ఎక్కువ శాతం చిత్రీకరణ కలకత్తాలో, కొంత భాగం దుబాయ్‌లో జరిపాం. పొల్లాచ్చిలో పాటతో పాటు కొంత టాకీ చిత్రీకరించామని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో 'క్రిష్' సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన చేసిన శ్యాన్‌కౌషల్ ఈ చిత్రానికి ఫైట్స్ సమకూర్చుతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా రియలిస్ట్‌గా వుంటాయి. పవన్‌కల్యాణ్ యాక్షన్ ఎపిసోడ్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని చెప్పుకొచ్చారు.

యువన్‌శంకర్ రాజా బాణీలు శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆడియో పెద్ద విజయం సాధించింది. యూత్‌లో పంజా ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. పంజా టీ షర్ట్సు, హ్యాండ్‌బ్యాండ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తమిళ వెర్షన్‌ను నెలరోజుల్లో సిద్ధం చేస్తాం. బాలీవుడ్ రీమేక్ హక్కుల్ని కూడా చాలా మంది అడుగుతున్నారు అని చెప్పుకొచ్చారు నిర్మాతలు. ఈ సినిమాలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ : శ్యాం కౌశల్, స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X