పంజా నిర్మాత నెక్ట్స్ సినిమా డీటేల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'పంజా' లాంటి డిజాస్టర్ మూవీని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన నీలిమ తిరుమలశెట్టి త్వరలో తన సంఘమిత్ర బ్యానర్ ద్వారా మూడు కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలెంట్ హంట్ ద్వారా పలువురు ఆసక్తి ఉన్న దర్శకులు, రచయితల ద్వారా స్కిప్టులు సేకరించారు.
వాటిలో నుంచి సేకరించిన ఒక స్ర్కిప్టు ద్వారా తొలి చిత్రానికి రెడీ అయ్యారు. 'అలియాస్ జానకి' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్ 25వ తేదీన ఈచిత్రం ప్రారంభం కానుంది. సుజీత్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుజీత్ సింగ్ చెన్నయ్‌లోని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడమీలో గ్రాజ్యుయేషన్ చేసి పలు అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ దర్శకుడిగా రూపొందుతున్న 'వెన్నెల 1/2' చిత్రానికి కూడా సుజీత్ సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 25న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
ఓ వైపు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో వైపు తమిళంలో బిల్లా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన దర్శకుడు విష్ణువర్ధన్ కావడం, పంజా సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.....భారీ విజయం సాధిస్తుందని ఆశ పడ్డ నిర్మాతలు ప్లాప్ కావడంతో షాక్ అయ్యారు.
ఇక పెద్ద హీరోలను నమ్ముకుంటే లాభం లేదని భావించిన నీలిమ తిరుపమల శెట్టి కొత్త వారితో తక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తూ పైకి రావాలని చూస్తున్నారు. మరి ఆమె ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











