పవన్ ‘పంజా’ టీజర్ దీపావళికి..
ఈ మధ్య ప్రతి సినిమా టైటిల్ కు టీజర్ తగిలించడం కామన్ అయిపోయింది. తాజాగా వచ్చిన దూకుడు సినిమా తీసుకుంటే...దాని టీజర్ 'డేరింగ్ అండ్ డాషింగ్". అదే విధంగా పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'పంజా"కు కూడా టీజర్ రాబోతోంది. దీన్ని అనౌన్స్ చేయడానికి కూడా ముహూర్తం గట్రా పెడుతున్నారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా టీజర్ ను అనౌన్స్ చేస్తాడట. అదే విధంగా ఆడియోను నవంబర్ లో విడుదల చేసి, డిసెంబర్ లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో పాటు సినిమాపై ప్రచారం పెరిగేందుకు పంజా పేరుతో టీషర్టులు, టోపీలు, టాటూలు దీపావళి నుంచి అభిమానులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభుయార్లగడ్డలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టారు. పంజా సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ సరసన సారా జేన్ డియాస్, అంజనా లవానియాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











