గోపీచంద్ 'పంతం' విడుదల తేదీ ఖరారు!
హీరో గోపిచంద్ చిత్రాలు వరుసగా పరాజయం చెందుతుండడంతో తడి కెరీర్ జోరు బాగా తగ్గింది. కెరీర్ ఆరంభంలో గోపీచంద్ వరుసగా మాస్ చిత్రాలతో దూసుకు పోయాడు. తాజాగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం పంతం. ఇటీవల విడువులైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొని ఉండడం విశేషం. నేడు గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా అతడి బర్త్ డేని చిత్ర యూనిట్ సెలెబ్రేట్ చేస్తోంది. అంతేకాదు పంతం విడుదుల తేదీ ప్రకటించడం కూడా విశేషం. జులై 5 గోపీచంద్ సోలోగా రాబోతున్నాడు. పంతం చిత్రాన్ని జులై 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెహ్రీన్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉన్నట్లు టీజర్ ని బట్టి అర్థం అవుతోంది. పంతం చిత్రంతో అయినా గోపీచంద్ తన పరాజయాలకు బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











