గోపీచంద్ 'పంతం' ట్రైలర్.. అదరగొట్టేశాడు, హిట్టు కొట్టాలని పంతం పట్టాడుగా!
సరైన విజయం కోసం హీరో గోపిచంద్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజగా గోపించంద్ నటించిన పంతం చిత్రం జులై 5 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ తో పంతం చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్, కామెడీ అంశాలతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రంతో చెప్పబోతున్నారు.
తాజగా పంతం ట్రైలర్ విడుదల చేశారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉంది. 'కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది. ధర్మం వైపు ఇలబడాలా.. అధర్మం వైపు నిలబడాలా నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి' అంటూ గోపించంద్ చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ లో చూపిన యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి.

చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా పాజిటివ్ బజ్ తో ఈ చిత్రం జులై 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











