చాలా ఫ్రెష్‌గా ఉంది: ‘పేపర్ బాయ్’ ట్రైలర్‌పై మహేష్ బాబు ప్రశంసలు!

By Bojja Kumar

సంతోష్ శోభన్, రియా సుమన్ హీరో హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పేపర్ బాయ్' సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూసిన మహేష్... ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు.

పేపర్ బాయ్ ట్రైలర్ చూశాను. ఫ్రెష్ గా..ప్లెజెంట్ గా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించారు. దివంగత దర్శకుడు శోభన్ గారితో నేను కలిసి పని చేశాను. ఆయన కుమారుడు సంతోష్ ఈ సినిమాలో హీరోగా నటించడం మరింత ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు గతంలో 'బాబీ' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాల ద్వారా హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్నారు.

Paperboy trailer Looks extremely fresh & pleasant: Mahesh Babu

కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది, డైరెక్షన్: వి. జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ, సంగీతం: భీమ్స్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్,
ఆర్ట్: రాజీవ్, స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X