కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ తేజ
''కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ... ప్రేక్షకులకు వినోదాన్నివ్వాలనే తపనతో తేజ ఈ చిత్రం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తను చేసిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తోంది. మరికొన్ని కామెడీ సన్నివేశాలను జోడించబోతున్నాం. ఈ సినిమాకు మహిళలు ఎక్కువగా రావడంలేదు. దానికి కారణం టైటిల్‌లో ఉన్న 'డాష్ డాష్'. అందుకే టైటిల్ నుంచి ఈ పదాలను తొలగించాం'' అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు.
క్రిందటివారం తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు డాష్ డాష్' చిత్రం విడుదలైంది. పిన్స్, నందితను హీరో, హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.కృష్ణకుమారి సమర్పణలో వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నీకు నాకు డాష్ డాష్'. ఈ చిత్రం టైటిల్ ని ,సినిమాని ట్రిమ్ చేసి వదిలారు. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
టైటిల్‌లో డాష్ డాష్ ఉండటం వలన అదేదో బూతు సినిమా అనుకుని మహిళలు రావడం లేదు. కానీ ఇందులో ఎలాంటి ద్వంద్వార్థాలు లేవు. ఓ చక్కటి ప్రేమ కథా చిత్రమిది. బోలెడంత వినోదం ఉంది. ఇకపై టైటిల్‌లోని డాష్ డాష్‌ని తీసేశాం. 'నీకు నాకు' అని మాత్రమే ఉంటుంది అంటూ తేజ మీడియాకు తెలియచేసారు.అలాగే...నేను రూపొందించిన చిత్రాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. 'చిత్రం', 'జయం', 'నువ్వు నేను' ఇలా నా గత చిత్రాలన్నీ మహిళలకు నచ్చాయి. కానీ తాజాగా రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' యుత్ కు నచ్చింది. మహిళలు మాత్రం థియేటర్ గుమ్మం తొక్కడం లేదు..దానికి టైటిల్ ఇబ్బందికరమని తెలిసింది. అందుకే టైటిల్ ని మార్చామని అన్నారు తేజ. ఇక రెండు వారాల తరవాత మరికొన్ని హాస్య సన్నివేశాలను సినిమాలో కలపడానికి సన్నాహాలు చేస్తున్నాం..నూరు శాతం ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా'' చెప్పుకొచ్చారు.
''అన్ని అంశాలు ఉన్న చక్కటి చిత్రాన్ని తీశారు తేజ. ప్రేక్షకులు ఆదరిస్తే మరికొంతమంది కొత్తవాళ్లను తెరకు పరిచయం చేయడానికి అవకాశం కలుగుతుంద''ని చెప్పారు నిర్మాత వి.ఆనందప్రసాద్. ఈ కార్యక్రమంలో ప్రిన్స్, నందిత, పరుచూరి వెంకటేశ్వరరావు, సుమన్‌శెట్టి, రసూల్, వేణు, యశ్వంత్ నాగ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











