బాలా 'పరదేశి' రిలీజ్ డేట్ ఖరారు
సహజశైలిలో సాగే బాలా చిత్రాలకు తెలుగులో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. అందుకే ఆయన చిత్రాలు మన దగ్గర క్రమం తప్పకుండా విడుదలవుతుంటాయి. ప్రస్తుతం తమిళంలో అధర్వతో బాలా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అది 'పరదేశి' పేరుతో తెలుగులోకి రానుంది. వాస్తవానికి ఆ కథానాయకుడి పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. బాలా పేరుతోనే ఆ చిత్రం మనల్ని పలకరిస్తుందన్న మాట.
అధర్వ హీరో. వేదిక, ధన్షిక హీరోయిన్స్. ఉమా రియాజ్‌ఖాన్ కీలక పాత్రధారి. జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బాలా నిర్మాతగా కూడా కొత్త అవతారమెత్తాడు. ఆడియో విడుదలైన నవంబరు 25నే ట్రైలర్‌ను కూడా యూట్యూబ్‌లో పెట్టారు. ప్రస్తుతం అది సంచలనం సృష్టిస్తోంది. అధర్వ వేషధారణ, బాలా రూపొందించిన తీరుకు విశేష స్పందన లభిస్తోంది. తొలి మూడురోజుల్లోనే 5 లక్షల మంది వీక్షించారు.
రెడ్ టీ అనే నవలనే పరదేశీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం ప్రస్దావిస్తే... ఆ నవలలోని ప్రధానాంశాన్ని మాత్రం తీసుకుని అందులో పరదేశి చేర్చి రూపొందిస్తున్నాను. వంద చిత్రాలతో పొందే అంతస్తును అధర్వ మూడవ చిత్రంతో పొందగలడని భావిస్తున్నాను. ఇందులో మీరు ఊహించని అంశాలే ఉంటా యి. నేను మినహా ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ కొత్తవారే. కెమెరామెన్ సెళియన్ నుంచి ఎడిటర్ కిషోర్ వరకు అందరూ నూతన సాంకేతిక వర్గమే అన్నారు.
దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్ కాదవుల్' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్ కాదవుల్' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1940నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్, మన్నముదురై, మున్నారు, తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు, కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు.


Click it and Unblock the Notifications












