దసరా సంబరాలకు సన్నిద్దం అవుతోన్న ‘పరమవీర చక్ర’...!
సింహా చిత్రంతో గత ఆరేడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్లాపుల పరంపరకు చెక్ చెప్పిన నందమూరి బాలకృష్ణ, ద్విపాత్రాభినయం చేస్తున్న 'పరమవీరచక్ర" జనవరి12న సంక్రాంతి సందర్బంగా విడుదల కానుంది. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న 150వ చిత్రం కావడం. దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ, నటిస్తున్న తొలి చిత్రం కావడం ప్రత్యేకతను సంతరించుకున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అమీషాపటేల్, నేహా దూపియా, షీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మూడు పాటల మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 10ను న్యూజిలాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా సమాంతరంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో 'మనుషులంతా ఒక్కటే, సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దాసరి, ఆయన తనయుడు బాలకృష్ణతో రూపొందిస్తున్న 'పరమవీర చక్ర" చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈయన దాసరి ఆశీస్సులతోనే అంచెలంచెలుగా అగ్ర నిర్మాతగా ఎదిగారు.


Click it and Unblock the Notifications