twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ బొబ్బిలి పులిలా, ఓ సర్ధార్ పాపారాయుడులా బాలకృష్ణ

    By Srikanya
    |

    మా సినిమాలో బాలకృష్ణ ఓ సర్ధార్ పాపారాయుడులా, ఓ బొబ్బిలి పులిలా జాతికోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతారు అంటున్నారు దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం పరమ వీర చక్ర. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా నటుడుగానూ, సైనికాధికారిగానూ బాలకృష్ణ కనిపిస్తారు. ఈ రెండు పాత్రలూ ఎలా కలుస్తాయి అన్నదే కథలో కీలకాసం అని దాసరి అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోజరుగుతోంది..దీని తర్వాత బ్యాలెన్స్ ఉన్న మూడు పాటలను ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తారు. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రోబో పేరడి ని బ్రహ్మానందం,అలీ లపై చిత్రీకరిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X