‘పరంపర’కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్

By Bojja Kumar

హైదరాబాద్: సీనియర్ నటులు నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పరంపర'. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది.

ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Parampara Got Platinum Award at International Film Awards

చిత్ర విశేషాలను దర్శక నిర్మాత మధుమహంకాళి తెలియజేస్తూ- మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో మంచి టాక్ ఉంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, క్లాసిక్ ఎంటర్‌టైనర్స్‌ను కూడా ఆదరిస్తారని ‘దృశ్యం' సినిమాతో రుజువుచేశారు. ఆ నమ్మకంతోనే ‘పరంపర' చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X