RGV పరాన్నజీవి.. బ్యాక్ గ్రౌండ్‌లో మెగా లింక్.. ఆ పేరు అర్థం అదేనా?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్ తో సాంగ్స్ తొ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతున్నాడు. మరోవైపు ఆర్జీవికి కౌంటర్ గా పరాన్న జీవి అనే ఆ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ఒక పేరు సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది.
Recommended Video

పరాన్న జీవి ఫస్ట్ సాంగ్..
పరాన్నజీవి..రెక్లెస్ జెనెటిక్ వైరస్ అంటూ రామ్ గోపాల్ వర్మపై మునుపెన్నడు లేని విధంగా ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ని కూడా నేడు విడుదల చేయబోతున్నారు. రాత్రి 8.20నిమిషాలకు ఆర్జీవికి కౌంటర్ ఇచ్చేలా ఆషాడ అమావాస్య స్పెషల్ లో భాగంగా ఈ సాంగ్ న్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.

నిర్మాత పేరులో మెగా లింక్..
ఇక ఈ సినిమాను బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు తెరకెక్కిస్తుండడం విశేషం. ఆ సంగతి అటుంచితే సినిమా ప్రొడ్యూసర్ పేరుపై అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. 99 థియేటర్ బ్యానర్‌పై స్కైమీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి నిర్మాత: CS అంటున్నారు. అందులో మెగా ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు ఉన్నాయనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఆ పేరులో ఉన్న అర్థం అదేనా?
CS అంటే.. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. మరో విధంగా ఆలోచిస్తే.. చరణ్, సుస్మిత కూడా ఉన్నారని టాక్ వస్తోంది. ఈ విధంగా సీక్రెట్ గా మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో పరాన్న జీవి సినిమా రూపొందుతున్నట్లు అనుమానాలు వస్తుండడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వర్మ దృష్టి మొత్తం ఆ సినిమాపైనే..
ఇక మరోవైపు వర్మ పవర్ స్టార్ సినిమా రేంజ్ పెంచుతూనే ఉన్నాడు గాని తనపై వస్తున్న సినిమాలపై ఏ విధంగాను స్పందించడం లేదు. ప్రస్తుతం తన దృష్టిని మొత్తం పవర్ స్టార్ ప్రమోషన్స్ పైనే పెడుతున్నాడు. ఎలాగైనా ఆ సినిమాను హిట్ చేయాలని ఓటీటీలో సినిమా ద్వారా మంచి లాభాలని అందుకోవాలని అభిమానులను మరింత రెచ్చగొడుతున్నాడు. ఇక పరాన్న జీవి సాంగ్ వచ్చిన తరువాత వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











