పరాన్నజీవి రెండో సాంగ్ లీక్: రాంగోపాల్ వర్మ నిజ స్వరూపం బయట పెట్టిన పవన్ ఫ్యాన్స్.!
తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులను కెలుకుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. వివాదాలతో సహవాసం చేసే ఆయన.. వరుసగా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలనే తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా 'పవర్ స్టార్' అనే సినిమాను రూపొందించాడు. ఇలాంటి సమయంలో జనసేనాని అభిమానులు ఆర్జీవీపై 'పరాన్నజీవి' అనే సినిమాను తీస్తున్నారు. వర్మ జీవితాన్ని సెటైరికల్‌గా చూపించబోయే ఈ మూవీలోని రెండో పాట లీక్ అయింది. ఆ సంగతులు మీకోసం.!

‘పవర్ స్టార్'తో ఆర్జీవీ మరో సంచలనం
ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ రూపొందించిన సినిమానే ‘పవర్ స్టార్'. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. కానీ, ఇది కల్పిత కథతో తీస్తున్న సినిమా అని మొదటి నుంచీ చెబుతున్నాడీ సెన్సేషనల్ డైరెక్టర్.

ఆ ఒక్క వీడియోతోనే మొదలైన రచ్చ
రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్' సినిమా తీస్తున్నప్పటికీ.. మెగా ఫ్యామిలీ కానీ, వాళ్ల అభిమానులు కానీ దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ చిత్రంలోని ‘గడ్డి తింటావా' అనే పాట విడుదలైందో అప్పటి నుంచి దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం విషయంలో ఆర్జీవీని పచ్చి బూతులు తిడుతున్నారు పవర్ స్టార్ అభిమానులు.

సినిమాను సినిమాతోనే కొట్టాలని ప్లాన్
‘పవర్ స్టార్' మూవీని జూలై 25న విడుదల చేస్తామని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ‘పరాన్నజీవి' (Reckless Genetic Virus) అనే సినిమాను తీస్తున్నారు. ఆర్జీవీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

వర్మకు ఆమావాస్య గిఫ్ట్.. మంచి రెస్పాన్స్
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘పవర్ స్టార్' మూవీ విడుదల అయ్యే రోజే ‘పరాన్నజీవి'ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 8.20 గంటలకు ఆషాడ అమావాస్య స్పెషల్‌గా ఓ సాంగ్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

RGV రెండో సాంగ్.. రిలీజ్‌కు ముందే లీక్
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘పరాన్నజీవి' సినిమాలోని రెండో పాట రిలీజ్‌కు ముందే లీకైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట తెగ చక్కర్లు కొడుతోంది. గంభీరమైన స్వరంతో సాగే ఈ సాంగ్ మొత్తం రాంగోపాల్ వర్మ తన క్యారెక్టర్‌ను వివరిస్తూ పాడినట్లు రూపొందించారు. దీన్ని మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
Recommended Video

వర్మ నిజ స్వరూపం బయట పెట్టారుగా
ఈ పాటలోని లిరిక్స్ చూస్తుంటే వర్మను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారో అర్థం అవుతోంది. ఇందులోని కొన్ని లైన్లు చూస్తే... ‘సినిమా నాకు వ్యాపారం... చీకటి గదిలో వ్యవహారం... ఒక్క ఛాన్స్ కావాలన్న ఆడపిల్ల నాకు ఆహారం... బ్లాక్‌మెయిల్‌తో బెదిరించేస్తా... బద్నాం చేసి సినిమా తీస్తా.. నోరు తెరిస్తే అబద్ధం.. నా బుర్ర నిండా అశుద్ధం' అంటూ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











