‘తల్లి చెల్లికి తేడా లేదు’ అంటూ ఆర్జీవీని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న ‘పరాన్నజీవి’.!
ఒకప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేసి దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కానీ, కొన్నేళ్లుగా ఆయన వివాదాస్పద సినిమాలనే చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మందికి శత్రువులా మారిపోయాడు. ఇప్పటికే ఎన్నో సున్నితమైన అంశాలతో సినిమాలు తెరకెక్కించిన ఆర్జీవీ.. తాజాగా పవన్ కల్యాణ్‌పై సెటైరికల్ మూవీని రూపొందించాడు. 'పవర్ స్టార్' అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మను టార్గెట్ చేస్తూ 'పరాన్నజీవి' అనే సినిమా వస్తోంది. తాజాగా ఆ మూవీలోని పాట విడుదలైంది.

ప్రత్యేకమైన థియేటర్‌తో వర్మ ప్లాన్
లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. అదే సమయంలో థియేటర్లు సైతం మూసివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటీటీ బిజినెస్ గణనీయంగా పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాంగోపాల్ వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించాడు. దాని ద్వారానే తన సినిమాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాడు.

పవర్ స్టార్ ప్రవన్ కల్యాణ్‌తో మూవీ
వరుసగా కాంట్రవర్శీ ఉన్న సినిమాలతో తీస్తున్న వర్మ... ప్రస్తుతం ‘పవర్ స్టార్' అనే ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాడాయన. అందులో భాగంగానే అచ్చం పవర్ స్టార్‌లా ఉన్న వ్యక్తిని హీరోగా పెట్టాడు. అంతేకాదు, అతడికి ప్రవన్ కల్యాణ్ అనే నామకరణం కూడా చేశాడు. దీంతో ఈ మూవీపై హైప్ ఏర్పడింది.

గడ్డి తింటావా అనడంతో రచ్చ స్టార్ట్
రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్' చిత్రం నుంచి వర్కింగ్ స్టిల్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నా పవన్ కల్యాణ్ బ్యాచ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆయన ఫ్యాన్స్ సైతం దీన్ని పట్టించుకోలేదు. కానీ, తాజాగా విడుదలైన ఆ చిత్రంలోని ‘గడ్డి తింటావా' అనే పాటతో రచ్చ మొదలైంది. అందులో చూపించిన స్టిల్స్‌తో పీకే ఫ్యాన్స్ ఆర్జీవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జీవీపై సినిమా.. ‘పరాన్నజీవి'లా
ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖుల జీవితాలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించాడు వర్మ. అయితే, తొలిసారి ఆయనపైనే ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ‘పరాన్నజీవి' అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా వెళ్లిన నూతన్ నాయుడు తీస్తున్నాడు. దీన్ని జూలై 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఆషాడ అమావాస్య స్పెషల్ సాంగ్
రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్' మూవీకి పోటీగా వస్తున్న పరాన్నజీవి (Reckless Genetic Virus) నుంచి ఆషాడ అమావాస్య స్పెషల్‌గా ఓ సాంగ్ విడుదలైంది. చిత్రంలోని మొదటి పాటగా చెబుతున్న దీన్ని సరిగ్గా సోమవారం రాత్రి 8.20 గంటలకు రిలీజ్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో లిరిక్స్ అన్నీ ఆర్జీవీకి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయి.
Recommended Video

‘తల్లి చెల్లికి తేడా లేదు' అంటూ ఆర్జీవీని
ఈ పాట మొత్తం రాంగోపాల్ వర్మను తిడుతున్నట్లు రాశారు. ‘చచ్చిన వాళ్లనూ వదలని జీవి.. ఈ ఆర్జీవీ' అంటూ సెటైర్లు వేశారు. మరీ ముఖ్యంగా ‘తల్లికి చెల్లికి తేడా లేని జీవి.. ఈ ఆర్జీవీ' అని చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇక, చివర్లో ‘పవన్ కల్యాణ్‌తో ఆట.. సింహంతో వేట లాంటిది' అంటూ పరోక్షంగా ఆయనకు వార్నింగ్ ఇచ్చింది ‘పరాన్నజీవి' యూనిట్.


Click it and Unblock the Notifications











