Parannageevi teaser: శ్రీరెడ్డిని శివాలెత్తించా.. ‘కత్తి’ దూసేలా.. పెగ్గు.. ఫిగర్ నా పక్కలోకి..

టాలీవుడ్‌లో ఆర్జీవి పేరుతో రూపొందుతున్న వెబ్ చిత్రం సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఈ క్రమంలో పరాన్నజీవి సినిమా టీజర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆ సినిమా టీజర్ ఎలా ఉందంటే..

సెన్సేషనల్‌గా పరాన్నజీవి

సెన్సేషనల్‌గా పరాన్నజీవి

కమెడియన్ షకలక శంకర్ ఆర్జీవి పాత్రలో యాక్టింగ్ చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం. తాజాగా విడుదలైన షకలకశంకర్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తక్కువకాలంలోనే పరాన్నజీవి ఆర్జీవి సినిమా ఒక సెన్సేషన్‌ క్రియేట్ చేసిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. రెక్లెస్, జెనిటిక్, వైరస్ అనే కాప్షన్ ఆర్జీవి సినిమాకు సరిగ్గా సరిపోయిందనే మాట ఫ్యాన్స్‌లో వినపడుతున్నది.

నాకు వోడ్కాతో పెట్టిన విద్య

నాకు వోడ్కాతో పెట్టిన విద్య

వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య. లక్ష్మీస్‌ బాంబుతో బాబు గారిని బద్‌నాం చేశాను. సివంగి శ్రీరెడ్డిని సినిమాస్టార్‌పై శివాలెత్తేలా చేశాను. కత్తి మహేష్‌ను కత్తి దూసేలా చేశాను. స్క్రిప్టు నాది.. స్క్రీన్ ప్లే నాది. ఫైటింగ్ వాళ్లది చీటింగ్ నాది. వాడుకోవడంలో వావి వరసలు లేవు. వోడ్కా పెగ్గులోకి రావాలి.. ఫిగర్ నా పక్కలోకి రావాలి అంటూ టీజర్‌లో ఆర్జీవి పాత్రధారి డైలాగ్స్‌తో హడలెత్తించారు.

శ్రేయాస్ యాప్‌పై రిలీజ్

శ్రేయాస్ యాప్‌పై రిలీజ్

99 థియేటర్ బ్యానర్‌పై రూపొందుతున్న పరాన్నజీవి సినిమాకు బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు డైరెక్ట్ చేస్తున్నారు. సీఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం స్కై మీడియా ద్వారా శ్రేయాస్ఈటీ ఫ్లాట్ ఫార్మ్ పై జూలై 25వ తేదీ 11గంటలకు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, డైలాగ్స్, పాటలు వైరల్ అయ్యాయి. తాజాగా విడుదలైన టీజర్ కూడా క్రేజీగా మారింది.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
పరాన్నజీవి వర్సెస్ పవర్ స్టార్

పరాన్నజీవి వర్సెస్ పవర్ స్టార్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న పవర్ స్టార్ సినిమాకు ధీటుగా పరాన్నజీవి రూపొందుతున్నది. వర్మ రిలీజ్ చేసే సమయానికే పరాన్నజీవి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీంతో పరాన్నజీవి వర్సెస్ పవర్ స్టార్ అంటూ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనావైరస్ సమయంలో ఈ రెండు సినిమాలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X