twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీకి వచ్చిందే ఆ సినిమా చూసి.. నేటికి కల నెరవేరింది.. మహేష్ ప్రాజెక్ట్‌పై పరుశురామ్ కామెంట్స్

    |

    గీత గోవిందం సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ క్యారెక్టర్‌లో విశ్వరూపం చూపించిన విజయ్ దేవరకొండను గీతగోవిందంలో మరో రేంజ్‌లో చూపించాడు దర్శకుడు పరుశురామ్. మొదటి నుంచి కథనే నమ్ముకుని ఉన్న ఈ డైరెక్టర్.. తీసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తన ముద్రను వేసుకున్నాడు. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి రెండేళ్లు అవుతున్నా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేకపోయాడు పరుశురామ్. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఓ క్లారిటీ ఇచ్చాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    ప్రతీ ఉగాదికి వెళ్లేవాడిని..

    ప్రతీ ఉగాదికి వెళ్లేవాడిని..

    లాక్ డౌన్ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరుశురామ్ అనేక విషయాలను పంచుకున్నాడు. ప్రతీ ఉగాదికి ఇంటికి వెళ్లేవాడినని, అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఉండటంలో హైద్రాబాద్‌లోనే ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.

     నాగేశ్వరరావు ఉంటుంది..

    నాగేశ్వరరావు ఉంటుంది..

    అక్కినేని నాగచైతన్యతో చేయబోయే నాగేశ్వరరావు సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అది చాలా మంచి స్క్రిప్ట్.. చైతు కెరీర్‌లో బెస్ట్ చిత్రం అవుతుందని ఆ విషయం ఆయనకు కూడా తెలుసునని అన్నాడు. చైతుతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు.

    ఆ సినిమా చూసి ఇండస్ట్రీలోకి..

    ఆ సినిమా చూసి ఇండస్ట్రీలోకి..

    మహేష్ బాబు ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపాడు. ఏనాటికైనా మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని అప్పుడే అనుకున్నానని పేర్కొన్నాడు. అయితే ఇన్నేళ్లకు అది తీరింది.. కన్నకల నెరవేరినట్టు అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.

    ఆ అవసర రాలేదు..

    ఆ అవసర రాలేదు..

    మరి మహేష్ బాబును హ్యాండిల్ చేయగలరా? ఇంతవరకు మాస్ సీన్స్, ఫ్యాన్ మూమెంట్స్ రాయలేదు కదా అని అడిగితే.. ఇప్పటి వరకు తాను రాసిన కథలకు, తీసిన సినిమాలకు అలాంటి అవసరం రాలేదని, అందుకే రాయలేదని తెలిపాడు. అయితే ఈ చిత్రంలో మాత్రం అవన్నీ ఉంటాయని, ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునేలా ఉంటుందని అన్నాడు.

    English summary
    Parasuram Came Industry After Seeing Mahesh Babu Okkadu Movie. Parasuram Says That I came to the industry after watching 'Okkadu'. I had a strong wish to work with him right from the time I worked as an assistant. It is going to be fulfilled now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X