నరేంద్ర మోడీ పాత్రలో లింగం మావయ్య!
హైదరాబాద్: 2014లో రాబోయే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ పార్టీ గెలుపుకు తోడ్పడే విధంగా ఓ సినిమా రాబోతోంది. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికల రథ సారథి, గురజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో లింగం మావయ్య పాత్ర) నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు అయిన మిఠేష్ పటేల్ నరేంద్ర మూడీపై తీసే ఈ సినిమాకు స్క్రిప్టు అందించారని, ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో మెడీకి ఇంత ఆదరణ పెరగడాకి గల కారణం ఏమిటి? గుజరాత్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన మెడీ చేతికి ప్రధాని పగ్గాలు వెళితే దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విధంగా ఈ సినిమా ఉండబోతోందట.

దాదాపు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని, ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలు పెట్టి మార్చి 2014 నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. నరేంద్ర మోడీకి సూచనల మేరకు స్క్రిప్టులో కొన్ని మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మోడీ గురించి పలు ఆసక్తికర విషయాలు సైతం పొందు పరచనున్నారని, ఒక సాధారణ వ్యక్తి అయిన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు, దేశ ప్రజలు ఆయన్ను ప్రధాన మంత్రిగా ఎందుకు కోరుకుంటున్నారు అనే అంశాలు సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











