ముద్దులు, అమ్మాయిల బట్టలు విప్పడం.. అలాంటోళ్ళు ఈ సినిమా చూడొద్దు, దర్శకుడి సెన్సేషనల్ స్పీచ్!
చిన్న చిత్రాలకు మంచి ప్రచారం లభించడం చాలా అరుదు. చిత్ర విడుదలయ్యాక అందులో మంచి కంటెంట్ ఉంటె ప్రేక్షకులే ఆ చిత్రానికి పబ్లిసిటీ కల్పిస్తారు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు ఘనవిజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తమ పరిచయం సినిమా కూడా అలాంటి చిత్రమే అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. డెబ్యూ హీరో విరాట్, యంగ్ హీరోయిన్ సిమ్రత్ కౌర్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. లక్ష్మీకాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. సీనియర్ నటుడు పృద్ధ్వి రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 21 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీకాంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మీడియాకు కృతజ్ఞతలు
దర్శకుడు లక్ష్మీకాంత్ మొదటగా మీడియాకు కృతజ్ఞతలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆడియన్స్ కు చేరవేస్తున్న తన పీఆర్ టీం, మీడియాకు కృతజ్ఞతలు అని లక్ష్మీకాంత్ అన్నారు.

డైరెక్ట్‌గా ఆడియన్స్‌కే
పరిచయం చిత్రం గురించి మాట్లాడుతూ లక్ష్మీకాంత్ నేరుగా ఆడియన్స్ కు సంచలన ప్రకటన చేశారు. నిజమైన ప్రేమ అంటే తెలియని వాళ్ళు ఈ చిత్రాన్ని చూడొద్దని అప్పీల్ చేశారు.

ప్రేమ గురించి తెలుసా
నేను నేరుగా ఆడియన్స్ కే చెబుతున్నాను. మీలో ఎవరికైనా ప్రేమ గురించి తెలుసా.. ఇంతవరకు కనీసం ఒక్క అమ్మాయినైనా, అబ్బాయినైనా ప్రేమించారా.. ప్రేమించి ఉంటేనే నా సినిమా చూడండి. నిజమైన ప్రేమ గురించి తెలిస్తేనే పరిచయం సినిమాకు రండి. లేకుంటే చూడవద్దు.

అలాంటి పనులు చేసేవాళ్ళు
బైకుల్లో తిరుగుతూ, కూల్ డ్రింగ్స్ తాగుతూ, బీచుల్లో విహరిస్తూ ప్రేమించుకుంటున్నాం అని భ్రమపడే వాళ్ళు ఈ సినిమాకు రావద్దు. అలాంటి వాళ్ళ కోసం ఈ సినిమా తీయలేదు అని లక్ష్మీకాంత్ అన్నారు.

నిద్రకూడా
నిజమైన ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు ఈ సినిమాకు రండి. మీ గుండెల్లో నిలిచిపోతుంది. మీరు నిద్రకూడా పోలేనంతగా ఈ సినిమా మీపై ప్రభావం చూపుతుంది అని లక్ష్మీకాంత్ అన్నారు.

అమ్మాయిల బట్టలు విప్పడం
బైకుల మీద తిరగడం, ముద్దులు పెట్టుకోవడం, అమ్మాయిల బట్టలు విప్పడం తరహా సన్నివేశాలు ఉండే చిత్రం కాదు పరిచయం. అవి ఆశించేవాళ్ళు ఈ సినిమాకు రావద్దు అంటూ పరోక్షంగా ఇటీవల వస్తున్న ప్రేమ కథా చిత్రాల గురించి దర్శకుడు వ్యాఖ్యానించారు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి
అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి తిరిగి ఇంటికి వస్తే.. ఆ తల్లి కూతుళ్ళ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్ గా చూపించాం. ఆ సన్నివేశం ప్రతి తల్లీకూతుళ్ల మనసుల్లో నిలిచిపోతుందని దర్శకుడు పేర్కొన్నారు.

జులై 21 న
ఈ చిత్రం జులై 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అందరూ ఆదరించాలని లక్ష్మీకాంత్ కోరారు. మళ్ళీ చెబుతున్నాను.. సిల్లీగా అమ్మాయిలతో ఆడుకునే వారు పరిచయం చిత్రం చూడొద్దని లక్ష్మీకాంత్ అప్పీల్ చేసారు.


Click it and Unblock the Notifications











