‘సుడిగాడు’ కామెడీతో పురిటి నొప్పులు-థియేటర్లోనే ప్రసవం
చిత్తూరు: టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' చిత్రం చూస్తూ ఓ మహిళ అనుకోకుండా డెలివరీ అయింది. చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమీల అనే మహిళ 9 నెలల గర్భవతి. మరో వారం రోజుల్లో వైద్యులు ఆమెకు కాప్పు జరుగుతుందని తెలిపారు. ఈ లోగా భర్తతో కలిసి సుడిగాడు సినిమా చూడటానికి వచ్చింది.
అయితే సినిమాలో కామెడీ సీన్లకు కడుపు చెక్కలయ్యేలా నవ్విన ప్రమీలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. విషయం గమనించిన థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శన నిలిపి వేసారు. అందరినీ బయటకు పంపించారు. 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా అది రావడం ఆలస్యం అయింది. ముందు జాగ్రత్తగా ప్రసవానికి ఏర్పాట్లు చేసారు. ప్రమీల నొప్పులు తాళలేక అక్కడే ప్రసవించింది.
అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా ఆమెకు సుఖ ప్రసవం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకున్న సమయానికంటే ముందుగానే తనకు కాన్పుకావడం, మగ బిడ్డ పుట్టడంతో సంతోషంతో పొంగిపోయిన ప్రమీల దంపతులు ఆ బాబుకి 'సుడి నరేష్' అని పేరు పెడతామని ప్రకటించారు.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











