చెప్పేదాకా ఆగలేరా? RRR ఆఫర్‌పై.. పరిణి చోప్రా చిర్రుబుర్రు.. ఇంతకీ ఎవరితోనంటే!

బాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా ఎప్పుడూ చేతినిండా ఆఫర్లు ఉండే హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరు. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన కేసరి చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో పరిణితి చోప్రా మాట్లాడుతూ.. డిజిటల్ మీడియాలోకి ప్రవేశించడం, రాజమౌళి RRR 'సినిమా ఆఫర్, ఇంకా పలు విషయాల గురించి ఆసక్తికరంగా చెప్పారు. పరిణితి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన బ్యూటి

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన బ్యూటి

డిజిటల్ ఫ్లాట్‌ఫాంకు ఆదరణ పెరుగుతుండటంతో నా దృష్టి వెబ్ సిరీస్‌పై పడింది. చాలా మంచి కంటెంట్ నా ముందుకు వచ్చింది. నా ముందు నాలుగైదు కథలు ఉన్నాయి. వాటిలో దేనిని ముందుగా చేస్తానో నాకు తెలియదు. డిజిటల్ ఫ్లాట్‌ఫాంపైకి ఎప్పుడెప్పుడూ రావాలనే ఆసక్తి పెరుగుతున్నది అని అన్నారు.

RRR మూవీలో పరిణితి

RRR మూవీలో పరిణితి

బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమాలో పరిణితి చోప్రా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. RRR సినిమాలో నటిస్తున్నానా? లేదా అనే విషయాన్ని చెప్పాలంటే కొంత సమయం ఉంది. త్వరలోనే అధికారికంగా ఏ విషయమైందీ చెబుతాను. వారంలో రోజుల్లో నేను నటించే సినిమాల గురించి ప్రకటిస్తాను అని పరిణితి చెప్పింది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో

బాలీవుడ్‌లో పరిణితి నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వరుస సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాల గురించి ప్లాన్ చేసుకొంటే వర్కవుట్ కావు. దేవుడి అనుగ్రహం ఉండాలి. మనం ప్లాన్ చేసుకొంటే విధి మరోలా ప్లాన్ చేస్తుంది అని పరిణితి అన్నారు.

ఎన్టీఆర్‌కా? రాంచరణ్‌కు జోడినా

ఎన్టీఆర్‌కా? రాంచరణ్‌కు జోడినా

అక్షయ్‌ కుమార్‌తో కేసరి, సందీప్ ఔర్ పింకి పరార్, జబ్రియా జోడి విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 21న కేసరి సినిమా రిలీజ్ కానున్నది. RRR మూవీ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. అయితే రాంచరణ్‌కు జంటగానా? లేక ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X