twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమానవీయం, సిగ్గు చేటు.. జొమాటో కేసులో బాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    ఒక్కోసారి కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంటాయి. సోషల్ మీడియా ప్రభావం చేత ఆ ఘటనలు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో జొమాటో డెలివరీ బాయ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. మహిళ చేస్తోన్న ఆరోపణలు, డెలివరీ బాయ్ చెబుతున్న విషయాలను పొంతనే ఉండటం లేదు. ప్రస్తుతం ఈ ఘటనలో చాలా మంది డెలివరీ బాయ్‌కే మద్దతు ప్రకటిస్తున్నారు.

    జొమాటో కేసు..

    జొమాటో కేసు..

    హితేషా చంద్రానీ అనే బెంగుళూరు యువతి జొమాటో నుంచి ఫుడ్‌కి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఎంత సేపయినా రాకపోవడంతో జొమాటో ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసి ఇక మీ ఫుడ్ వద్దని, ఇస్తే ఫ్రీగా ఇవ్వాలని, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని హెచ్ఛరించింది.

    దాడి చేశాడంటూ..

    దాడి చేశాడంటూ..

    అయితే చివరగా డెలీవర్ బాయ్ రావడం, అతని వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది. మొదటగా డెలివరీ బాయ్ దురుసుగా ప్రవర్తించాడని, ఇంట్లోకి వచ్చి దాడి చేశాడని, పిడి గుద్దులు గుద్దాడని, ముక్కు పగిలిపోయిందంటూ ఏడుస్తూ ఓ వీడియోను వదిలింది సదరు యువతి.

    డెలివరీ బాయ్ ఆవేదన..

    డెలివరీ బాయ్ ఆవేదన..

    అలా యువతి వీడియో వైరల్ అవ్వడంతో డెలివరీ బాయ్ మీద కేసు పెట్టారు.అరెస్ట్ కూడా చేశారు. అయితే ఒక్కసారి డెలివరీ బాయ్ చెప్పింది వింటే అసలు కథ యూటర్న్ తీసుకుంది. ఫుడ్ తీసుకుని, డబ్బులు కూడా ఇవ్వలేదని, పైగా చిన్న చూపు చూస్తూ మాట్లాడిందని, చెప్పుతో కొట్టిందని, ఆ ఘటనలో ఆమె చేతికి ఉన్న ఉంగరం తాకి ఆమె ముక్కుకు గాయమైందని సదరు డెలివరీ బాయ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తన జీవితం నాశనం అవుతోందని తగిన న్యాయం చేయమని డెలివరీ బాయ్ ఏడుస్తూ ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    అమానవీయం..

    అమానవీయం..

    తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా స్పందించింది. జోమాటో ఇండియా - దయచేసి నిజమేంటో కనుగొని పబ్లిక్‌గా రిపోర్ట్ చేయండి. డెలివరీ బాయ్ నిర్దోషి అయితే (అతన్ని నేను నమ్ముతున్నాను), వెంటనే మహిళను శిక్షించేందుకు సాయపడండి. ఇది అమానవీయం, సిగ్గుచేటు మరియు హృదయ విదారకం.. నేను ఎలా సహాయం చేయగలనో తెలపండి.. అంటూ స్పందించింది.

    English summary
    Parineeti chopra about zomato delivery boy case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X