Parineeti Chopra engagement నిశ్ఛితార్థంలో ఏం వడ్డించారో తెలుసా? విందును ఏర్పాటు చేసింది ఎవరంటే?
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఢిల్లీలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు, పలు పార్టీలకు చెందిన నేతలు హాజరవ్వడగా అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ ముగిసింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ నిశ్చితార్థం కన్నుల పండువగా సాగింది. నిశ్చితార్థం అనంతరం పరిణితి, రాఘవ్ ఇద్దరు ఫోటోలను షేర్ చేశారు. ఈ నిశ్చితార్థం వేడుక విశేషాలు, వివరాల్లోకి వెళితే...
సింగర్ నిశా శెట్టి జోష్‌గా: పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ కార్యక్రమం మే 13 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన హోస్ట్‌గా సింగర్ నిశా శెట్టి వ్యవహరించింది. నిశా శెట్టి హుషారుగా డిస్కో దివానీ పాటలు పాడుతుండగా అతిథులు జోష్‌లో మునిగిపోయారు. చాలా రోజుల తర్వాత నజియా హసన్ పాటలు ఈ నిశ్చితార్థ వేడుకలో హోరెత్తాయి.

అతిథులు ఎవరు వచ్చారంటే?: పరిణితి చోప్రా, రాఘవ్ నిశ్చితార్థానికి ప్రియాంక చోప్రా, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహర్, సానియా మిర్జా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య థాకరే, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తదితరులు హాజరయ్యారు.

స్పెషల్ ఎట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా: పరిణితి చోప్రా నిశ్చితార్థ వేడుకకు ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఈ వేడుకలో నిక్ జోనస్, ప్రియాంక చోప్రా కూతురు మల్టీ మేరీ హాజరవుతారని అనుకొన్నారు. కానీ వారిద్దరూ వేడుకలో కనిపించకోవడంతో ఢిల్లీకి వచ్చారా? లేదా అనే అనుమానం తలెత్తింది.

సానియా మిర్జా విషెస్ తెలియజేస్తూ: నిశ్చితార్థం చేసుకొన్న జంటకు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి రణ్ వీర్, కపిల్ శర్మ, అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ఇంకా నేహా దూపియా, సానియా మిర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం ప్రేమ, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొన్నారు.

విందులో ఏం వడ్డించారంటే?: పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం వేడుకలో నోరూరించే వంటకాలను సిద్దం చేశారు. ఫుడ్, హోటల్ బిజినెస్‌లో ఉన్న రాఘవ్ చద్దా సోదరుడు సహజ్ మెనూను చూసుకొన్నారు. మాంసాహార ప్రియులకు ఇండియన్ వంటకాలతోపాటు కబాబ్స్ అందించారు. శాఖాహారులకు పలు రకాల పన్నీర్, ఇతర వంటకాలను భారీగా సిద్దం చేశారు.


Click it and Unblock the Notifications











