మహేష్ బాబు అంటే ఎందుకంత పిచ్చి? ఈవిడా అదే బాపతు!

తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కూడా తనకు మహేష్ బాబు అంటేనే ఎంతో ఇష్టమని, సౌత్ హీరోల్లో నా ఫేవరెట్ హీరో అతడే అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇలా చెప్పడం ద్వారా మహేష్ బాబుతో నటించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పకనే చెప్పేసింది. చూద్దాం అమ్మడి ఎవరైనా దర్శకుడు తీరుస్తాడో? లేదో...?
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...
మహేష్ బాబు ప్రస్తుతం 'ఆగడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
మరో వైపు మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా ఓ సినిమా రాబోతోందనే వార్తలపై అశ్వినీదత్ స్పందించారు. ఫ్యామిలీతో కలిసి తిరుమల వచ్చిన సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమా గురించిన విషయాలు వెల్లడించారు. నవంబర్లో మహేష్ బాబుతో సినిమా మొదలు పెడుతున్నట్లు తెలిపారు. మైత్రి మూవీస్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కనుంది. ఆగడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











