»   »  రాణా ‘కవచం’: ఆ ముగ్గురు భామల్లో ఎవరు?

రాణా ‘కవచం’: ఆ ముగ్గురు భామల్లో ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి', మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రం షూటింగులతో బిజీగా గడుపుతున్న హీరో రాణా త్వరలో 'కవచం' అనే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు.

'కవచం' చిత్రాన్ని తెలుగు, హిందీ ద్విబాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో పాపులర్ అయిన హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం పరిణితి చోప్రా, నర్గీస్ ఫక్రి, శ్రద్ధ కపూర్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ముగ్గురు భామల్లో ఒకర్ని ఫైనల్ చేయనున్నారు.

ఈ విషయమై దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ...'కవచం చిత్రం కోసం బాలీవుడ్ భామను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఈ చిత్రం హిందీ, తెలుగులో తెరకెక్కుతున్న ద్విబాషా చిత్రం' అని చెప్పుకొచ్చారు. ఎంపిక ఫైనలైజ్ అయన తర్వాత అఫీషియల్‌గా వెల్లడిస్తామని తెలిపారు.

'కవచం' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాణా సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో 'దమ్ మారో దమ్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాణా తొలి ప్రయత్నంలో విఫలం అయ్యాడు. దీంతో కొడుకును బాలీవుడ్లో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా భారీగా ప్లాన్ చేస్తున్నారు రాణా తండ్రి సురేష్ బాబు.

English summary
Actor Rana Daggubati, who is currently busy shooting for Baahubali and Rudramadevi, is gearing to do a high-octane action-drama titled Kavacham. The actor is teaming up with Andala Rakshasi fame director Hanu Raghavapudi for the film, which is simultaneously made in Telugu and Hindi. The makers are considering the names of Parineeti Chopra, Nargis Fakhri and Shraddha Kapoor for the female lead alongside him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu