»   »  సెక్సీ‌ లుక్ కోసం రూ. 10 లక్షలు ఖర్చు పెట్టిన హీరోయిన్!

సెక్సీ‌ లుక్ కోసం రూ. 10 లక్షలు ఖర్చు పెట్టిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంత కాలంగా అసలు సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘కిల్ దిల్' విడుదలయ్యాక పది నెలల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె ఈ మధ్య ఏ సినిమాలోనూ కనిపించ లేదు.

కిల్ దిల్ సినిమా తర్వాత పరిణీతి చోప్రా మీడియాతో మాట్లాడుతూ...విరామ సమయంలో కొంత కాలం పాటు స్నేహితురాళ్లతో కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తానని, తర్వాత సినిమా రంగంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తానని చెప్పింది. ఆమె ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే ఈ గ్యాపులో బరువు సమస్యను తగ్గించుకోవడంతో పాటు స్నేహితులతో వివిధ ప్రాంతాలు తిరిగి ఎంజాయ్ చేసింది.

Parineeti Chopra new look

చాలా రోజుల తర్వాత పరిణీతి చోప్రా మళ్లీ మేగజైన్లపై హాట్ అండ్ సెక్సీ స్లిమ్ లుక్ తో దర్శనమిచ్చింది. ఇంత కాలం అమ్మడు విరామం తీసుకున్నది బరువు తగ్గి సెక్సీ లుక్ కోసమే అని స్పష్టమవుతోంది. గత కొన్ని నెలలుగా అమ్మడు కఠినమైన డైట్ పాటించడంతో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు గట్రా చేస్తోంది.

ఈ మాత్రం దానికి సినిమాలకు దూరంగా ఉండటం ఎందుకు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పరిణీతి చోప్రా బరువు తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే అమ్ముడు ఇంతలా కష్టపడుతోంది. బరువు తగ్గేందుకు ప్రత్యేక చికిత్సల కోసం దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

English summary
A couple of days ago Parineeti Chopra posted several pictures from her photo shoot with a magazine, looking visibly slimmer than before.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu