10 నెలల పాటు సినిమాలకు దూరంగా....

By Bojja Kumar

ముంబై: చేసినవి అరడజను సినిమాలు. హీరోయిన్‌గా ఇంకా పూర్తిగా తనను తాను నిరూపించుకోలేదు. చెప్పుకోవడానికి ఖాతాలో గొప్ప హిట్లు కూడా లేవు. అంతలోనే ఏకంగా 10 నెలల పాటు సినిమాలకు విరామం తీసుకోవడానికి ఏ హీరోయిన్ అయినా సాహసం చేస్తుందా?....కానీ చేస్తానంటోంది బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ పరిణీతి చోప్రా.

ప్రస్తుతం తాను నటించిన బాలీవుడ్ మూవీ ‘కిల్ దిల్' విడుదలయ్యాక పది నెలల పాటు విరామం తీసుకోనున్నట్లు నటి పరిణీతి చోప్రా ప్రకటించింది. ఈ చిత్రంలో తన పెర్పార్మెన్స్ పట్ల ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని పరిణీతి చెప్పుకొచ్చింది. వారి స్పందన బట్టి భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలనుకునేదానిపై నిర్ణయం తీసుకుంటానంటోంది.

Parineeti Chopra to take a break after kill Dil

ఈ పది నెలల కాలంలో కొంత కాలం పాటు స్నేహితురాళ్లతో కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తానని, తర్వాత సినిమా రంగంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తానని అంటోంది. అయితే పరిణీతి నిర్ణయం బాలీవుడ్ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వైపు కొందరు హీరోయిన్లు అవకాశాలు లేక ఎదురు చూస్తుంటే....ఇప్పుడిప్పుడే అవకాశాల బాట పడుతున్న పరిణీతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని నివ్వెర పోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X