»   »  బూతు ఫోటోలతో మార్పింగ్: హీరోయిన్ ఫిర్యాదు

బూతు ఫోటోలతో మార్పింగ్: హీరోయిన్ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కృష్ణుడు, సంగకుమార్ హీరోలుగా తెరకెక్కుతున్న 'తురుం' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న పరినిధి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖాన్ని మార్పింగ్ చేసి అశ్లీలంగా ఇంటర్నెట్లో పెట్టారని, తురుం సినిమాకు సంబంధించిన వీడియోల్లో తన ముఖాన్ని, ఫోటోలని మార్ఫింగ్ చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Parinidhi files complaint against 'morphed' pictures

తురం సినిమా వివరాల్లో్కి వెళితే...'ఒక అమాయకునికి అన్యాయం జరిగితే అతను తిరగబడితే అతడే 'తురుం' అనే కథాంశంతో నిర్మించినదే ఈ చిత్రం'. సుదీక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరో కృష్ణుడు, సంగకుమార్, పరినిధి, పావని, ముఖ్తర్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

యాక్షన్‌, కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'తురుం' చిత్రాన్ని తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుందని ప్రచార కార్యక్రమాల్లో దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: సీతాల రఘువేందర్, నిర్మాత: పి.వి.రావు, దర్శకత్వం: శ్రీధర్.

English summary
Thurum movie actress Parinidhi filed complaint against 'morphed' pictures.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu