'రక్త చరిత్ర' లో పరిటాల రవిని మార్చి అలా...
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" లో వివేక్ ఒబరాయ్...పరిటాల రవి పాత్రను పోషిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఆ పాత్రకు వర్మ...ప్రతాప్ రవి అని పెట్టారు. అలాగే మద్దెల చెరవు సూరిగా గా కనిపించే సూర్య కి సూర్య భాను రెడ్డి అనే పేరు పెట్టారు. ఇక ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న శతృఘ్నసింహాకు శివాజీరావు అనే పేరుని, ఓబుర్ రెడ్డి పాత్ర పోషిస్తున్న అభిమన్యు సింగ్ కి బుక్కారెడ్డి అని పెట్టారు. ఇలా పేర్లు పెట్టకుండా ఆ పేర్లకు దగ్గరగా ఉండే పేర్లను పెట్టి విడుదల అయ్యాక రాబోయే తలనొప్పలను ముందే ఎదుర్కొనే ప్రయత్నం చేసారు. అలాగే తాను పరిటాలరవి కథ తీయలేదని, కేవలం ప్రేరణ పొంది కథ చేస్తున్నానని ఇప్పటికే చెప్పారు.
అలాగే రక్త చరిత్ర కధ..రాయలసీమలో జరగకపోవచ్చు. బీహార్ లో జరిగిందనుకోండి. ఇది కథ. ఎక్కడైనా జరగవచ్చు. రెండు వర్గాల మధ్య పోరాటం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇక పరిటాల రవి కథగా చెప్పనప్పుడు...మరి ఎందుకు వారి కథను సినిమాకు తీసుకున్నారు అని అడిగితే.. సినిమాకు ఏదో ఒక కథ కావాలి కాబట్టి తీసుకున్నాం అన్నారు. ఇక హిందీ నటుడు వివేక్ ఒబరాయ్, తమిళ నటుడు సూర్యలను తెలుగు కథ రక్త చరిత్రలో ప్రధాన పాత్రలకు తీసుకోవటానకి కారణం చెబుతూ..తెలుగు వారైతే లీగల్ గా కొన్ని చిక్కులు వస్తాయి. అయినా ఇరు వర్గాల మధ్య పోరాటం అన్నప్పుడు ఆ ఎమోషన్స్ బాగా ఆ నటులు పండించగలరని తీసుకున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











