'రక్తచరిత్ర' లో లాగ నా పెళ్ళి జరగలా...పరిటాల సునీత
సినిమాలలోగా పరిటాల రవి గన్నులతో వచ్చి తనను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోలేదని పరిటాల సునీత అన్నారు. పరిటాల అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కలసి ఆమె రక్తచరిత్ర సినిమాను త్రివేణి థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తను పరిటాల రవి, ఒకరికొకరు ఇష్టపడే పెళ్ళి చేసుకున్నామని ఆమె అన్నారు. అలాగే రక్తచరిత్ర సినిమా వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. అయితే ఇప్పుడే పూర్తిగా చెప్పలేనని, ఆ తరువాతే సినిమాపై వాస్తవాలను వెల్లడిస్తానని అన్నారు. రక్త చరిత్ర మా రెండో భాగాన్ని పార్టీ నాయకుల తో కలిసి చూస్తానన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి ఆపదలో ఆదుకున్న పరిటాల శ్రీరాములు కుటుంబాన్ని హత్యలు చేసే కుటుంబంగా చిత్రీకరించడం బాగోలేదన్నారు. అయితే ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర పాత్రధారులు బాగా నటించారని ఆమె కితాబిచ్చారు. పరిటాల సునీత పాత్ర వేసిన మహిళ బాగా నటించిందని మెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











