రామ్ గోపాల్ వర్మ హామీ ఇచ్చారు...పరిటాల సునీత
రవి హీరోగా సినిమా తీస్తా..ఆయన ఇమేజ్ దెబ్బతినకుండా చూస్తానని హామీ ఇచ్చారు అంతే. సినిమా ఎంత వరకు తీశారో, కథ ఏమిటో కూడా నేనడగలేదు. సినిమా చూసిన తర్వాత చెప్తా...అంటున్నారు పరిటాల సునీత. ఆమె నిన్న ఆదివారం రాత్రి ఓ ప్రెవేట్ ఛానెల్ తో మాట్లాడారు. ఆమెను రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమా గురించి మీతో ఏం చెప్పలేదా? అని ప్రశ్నించగా ఇలా స్పందించారు. ఇక రామ్ గోపాల్ వర్మ...రక్త చరిత్ర చిత్రాన్ని రెండు పార్టులుగా తీస్తున్నారు. 'రక్త చరిత్ర' పస్ట్ ఫార్ట్ రిలీజ్ ఆగస్టు 11న అవనుంది. మొదటి పార్ట్ రిలీజైన రెండు వారాల తర్వాత పార్ట్-2 రిలీజవుతుంది.
రక్తచరిత్ర కథ గురించి వర్మ చెబుతూ..పూర్తిగా అనంతపూర్ లో జరిగిన యథార్థ కథ. ఇద్దరు ఫ్యాక్షనిస్టుల కథను తెరకెక్కించాను. పరిటాల రవి, సూరి కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. పగలు, ప్రతీ కారాల వెనుక కచ్చితంగా రాజకీయ శక్తులు ఉంటాయి. వాటి గురించి చర్చించే కథ ఈ సినిమా. ఇందులో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, సూరిగా సూర్య చేశారు. ఈ సినిమా కోసం పరిటాల రవి సన్నిహితులను, సూరిని కలుసుకుని వివరాలు సేకరించాను అన్నారు. సూరి భార్య భానుమతి కేరక్టర్ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.


Click it and Unblock the Notifications











