'రక్త చరిత్ర' గురించి పరిటాల సునీత హెచ్చరిక
తనకు మొదట రక్త చరిత్ర చిత్రం చూపెట్టే తర్వాత రిలీజ్ చెయ్యాలని పరిటాల సునీల్..నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఆ చిత్రంలో ఆమె తన భర్త ఎలా ప్రొజెక్టు చేసారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని ఆమె చెప్తున్నారు. ఏ విధంగానూ మిస్ లీడ్ చేసే సన్నివేశాలు ఉన్నా, సమస్యలు ఉన్నా రిలిజ్ కు ముందే పరిష్కరించుకోవటం మేలన్న దిశలో ఇలా చిత్రం చూసే అవకాశం కోసం అడిగనట్లు తెలుస్తోంది. ఇక ఇలా తనకు చూపకుండా రక్త చరిత్ర చిత్రం రిలీజ్ చేసినట్లయితే కోర్టుకు వెళ్ళటానికి కూడా వెనుదీయునని హెచ్చరించినట్లుగా వినిపిస్తోంది. ఇక ప్రి ప్రొడక్షన్ సేజీలో రామ్ గోపాల్ వర్మ పరిటాల సునీతను కలిసి ఈ స్క్రిప్టు విషయమై చర్చించన సంగతి తెలిసిందే. ఇక పరిటాల రవిగా వివేక్ ఒబరాయ్, పరిటాల సునీతగా రాధా ఆప్టే, మద్దెల చెరువు సూరిగా సూర్య, అతని భార్య భానుమతిగా ప్రియమణి ఈ చిత్రంలో కనిపంచనున్నారు. శతృఘ్నసింహా..ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నారు. అలాగే ఆగస్టు 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











