డీల్ అదిరింది.. సౌత్ మొత్తం ఎన్టీఆరే.. నార్త్‌లో సల్లూభాయ్!
సౌత్ లో కార్పొరేట్ సంస్థల ఎండార్స్మెంట్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకుపోతుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు ప్రకటన విషయంలో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రోతో ఎన్టీఆర్ ఓ బిగ్ డీల్ కు సైన్ చేశాడు.

త్వరలో ఆ యాడ్
పార్లే ఆగ్రోతో కుదిరిన డీల్ నేపథ్యంలో త్వరలో ఆ సంస్థ ఉత్పత్తి అయిన యాప్పి ఫిజ్ పానీయం కోసం ఎన్టీఆర్ బుల్లి తేరా యాడ్ లో కనిపించబోతున్నాడు. పార్లే ఆగ్రో సంస్థతో ఎన్టీఆర్ ఎన్నేళ్లకు కాట్రాక్ట్ కుదుర్చుకున్నాడు.. ఎంత మొత్తానికి ఒప్పందం జరిగింది అనే విషయాలు బయటకు రాలేదు. కానీ ఆ సంస్థ ఎన్టీఆర్ కు భారీ మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేసినట్లు బిజినెస్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

సౌత్ మొత్తం
సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తానికి ఎన్టీఆర్ పార్లే ఆగ్రో సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. కాగా నార్త్ లో ఇప్పటికే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యాప్పి ఫీజ్ అద్భుతమైన మార్కెట్ తో దూసుకు పోతోంది. సౌత్ లో ఈ ప్రోడక్ట్ అమ్మకాలు మరింతగా పెంచాలని మైసూర్ లో కొత్తగా తన ఉత్పత్తుల తయారీ యూనిట్ ని ప్రారంభించింది. చెన్నై, హైదరాబాద్ నగరాలలో ఇప్పటికే పార్లే ఆగ్రో ఉత్పత్తులు తయారవుతున్నాయి.

చాలా ఇష్టం
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ యాప్పి ఫిజ్ అంటే తనకు చాలా ఇష్టం అని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ సంస్థకు ప్రచారకర్తగా మారడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఇప్పటికే సెలెక్ట్ మొబైల్స్, బోరో ప్లస్, నవరత్న లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్లే ఆగ్రో సంస్థ మరో ఉత్పత్తి అయిన ఫ్రూటీకి అల్లు అర్జున్, అలియా భట్ ప్రచారకర్తలుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్‌లో
ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రం భారీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతోంది. డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











