twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛానెల్స్ తిక్క కుదరనుందా?

    By Staff
    |

    క్రెమ్,సెక్స్ లేకుండా టీవీ ఛానెల్స్ పోగ్రామ్స్ తయారు చేయవు. అదేం అంటే టీఆర్ పీ రేటింగ్ లు చూడండి వాటికే వస్తాయి అని చెప్తూంటారు. దాంతో మంచి పోగ్రమ్ ఉన్నా వ్యూయర్ షిప్ లేదనే నెపంతే టీవీలు ఆ పోగ్రాములు ఎత్తేస్తూంటూయి. అయితే ఈ కార్యక్రమానికి త్వరలో తెరపడనుంది.నిజానికి వందలాది టీవీ ఛానళ్లు, కోట్లాది ప్రేక్షకులు... అయినా ఒక్కో ఛానల్‌ను ఎంత మంది చూస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు. కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలపై ఆధారపడాల్సిన దుస్థితి. మొత్తానికి దీనిపై కదలిక వచ్చింది.

    టీవీ వీక్షకుల సంఖ్యను తెలియజేసే టీఆర్‌పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌) రేటింగ్స్‌ విషయంలో ప్రభుత్వ ఉదాసీన ధోరణిపై పార్లమెంట్‌ స్థాయీసంఘం విరుచుకుపడింది. ప్రస్తుతం అమలులో ఉన్న టీఆర్‌పీ లెక్కింపు ప్రక్రియ అనేక దుష్పరిణామాలకు దారి తీస్తుందని, దాని స్థానంలో మెరుగైన విధానాన్ని వీలైనంత త్వరలో తీసుకురావాలని, టెలివిజన్‌ ప్రసారాలపై సమగ్రచట్టాన్ని రూపొందించాలని సిఫార్సు చేసింది. అప్పటివరకూ టీవీ ప్రసారాంశాల నియంత్రణ బాధ్యతలను టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌)కు అప్పగించాలని పేర్కొంది.

    సమాచార సాంకేతికతపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయీసంఘం రూపొందించిన 'భారతదేశంలో టీవీ ప్రేక్షకుల లెక్కింపు విధానం' నివేదికను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. టీవీ ప్రసారాలకు ఉపయోగించే వాయుతరంగాలు జాతీయ సంపదే కాబట్టి వాటిని ప్రభుత్వమే నియంత్రించాలని సుప్రీంకోర్టు 1995లోనే తీర్పునిచ్చినా... ప్రభుత్వం ఇప్పటి వరకూ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలు చేపట్టలేదంటూ స్థాయీసంఘం విమర్శించింది. టీఆర్‌పీ రేటింగ్స్‌ అనేవి తమకు, ప్రకటనలసంస్థలకు మాత్రమే ఉపయోగపడతాయంటూ ప్రైవేటు బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీల సంఘం వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకించింది.

    ఇటువంటి అభిప్రాయం ఉండటం వల్లనే రేటింగ్‌ విధానంలో ప్రేక్షకుల ఇష్టాయిష్టాలకు, సున్నితత్వానికి ఏ మాత్రం విలువ లేకుండా పోయిందని పేర్కొంది.ఇక ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల ఛానెల్స్ లో వచ్చే మంచి పోగ్రామ్స్ చూసే కొద్ది మంది ప్రేక్షకుల అభిప్రాయాలకూ వాల్యూ పెరుగుతుందని అంతా ఆశిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X