నారా రోహిత్ నెక్స్ట్ చిత్రం బ్యానర్ ల్యాంచింగ్ విశేషాలు
బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. యస్.వి.కె. సినిమా పతాకంపై పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం బ్యానర్ ని శనివారం దర్శకుడు పైడిపల్లి వంశీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాకు నిర్మాత తెలియచేస్తూ... మా స్వస్థలం వైజాగ్.
షిప్పింగ్ ఫీల్డ్‌లో ఉన్నాం. సినిమాల మీద ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాం. పరశురామ్ మంచి కథ చెప్పారు. ఫిబ్రవరి 13న ప్రారంభించి మార్చి మొదటి వారంలో వైజాగ్‌లో తొలి షెడ్యూల్ జరుపనున్నాం. రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేసి మే నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
పరశురామ్ మాట్లాడుతూ- ఇది నా మూడో చిత్రం. ఈ సినిమాతో రోహిత్ మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపు పొందుతాడు. మంచి టీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో ప్రకాష్‌రాజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రను చేస్తున్నాడన్నారు.
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ 'వంశీ పైడిపల్లి గారు వచ్చి బ్యానర్ లాంచ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాణం సినిమా తరువాత మంచి కధ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పరుశురామ్ గారు మంచి కధ చెప్పారు.ఈ సినిమా తో మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నాను అన్నారు.
ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, జయసుధ, సుమలత, ఎం.ఎస్.నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).


Click it and Unblock the Notifications











