twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ఫీల్డ్ లోనూ తెలంగాణా వివక్ష?

    By Staff
    |

    Samakka Sarakka
    కళకు ప్రాంతీయ వివక్షత ఉంటుందా..ఉంటుందని నిరూపిస్తున్నారు తెలుగు పరిశ్రమలో చాలామంది. దాంతో తెలంగాణా నేపధ్యంలో తయారైన సినిమాలకు చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని ఆ నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. మొన్నటికి మొన్న బ్రతుకమ్మ హిట్టయితే అంతా స్టేజీలెక్కి మొచ్చుకున్న వారే గానీ,ఒక్కరు కూడా రిలీజ్ కి ఆ సినిమా పడ్డ ప్రసవ వేదనను పట్టించుకున్న వారు లేరు.

    మళ్ళి ప్రముఖ కమెడియన్,మాజీ మంత్రి బాబు మోహన్ తన కుమారుడు ని హీరోగా చేస్తూ తెలంగాణా దేవతలయిన సమ్మక్క,సారక్కల కథతో తీసిన మేడారం సమ్మక్క సారక్క మహాత్యం చిత్రానికి అదే పరిస్ధితి ఎదుర్కోంటోంది. దాంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా సినిమా కనకదుర్గమ్మ అమ్మవారిది అంతేకాని తెలంగాణా గానం కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదే ఏ రాయలసీమ నేపద్యంలో సినిమా తీస్తే నైజాం ఏరియాలో రిలీజ్ కి ఇబ్బంది ఉండదు.

    పోనీ తెలంగాణా నుండి వచ్చిన నిర్మాతలయినా కాస్త కమర్షియల్ దృక్పదం విడనాడి తమ ప్రాంత సినిమాలను ప్రమోట్ చేస్తారా అంటే అదీ లేదు. ఈ వివక్షత పైకి కనిపించని పెద్ద ప్రమాదం. పెద్ద వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం అని సీనియర్స్ హితువు చెప్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X