అమీర్ ఖాన్ ఇంట్లో విందు...హంగామా
ఈ కొత్త ఇంట్లో అమీర్ విందు వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్, అనుష్కాశర్మ, కత్రినాకైఫ్, రాకేష్ ఓం ప్రకాశ్‌మెహ్రా, అభిషేక్ బచ్చన్, రాజు హిరానీలను ఆహ్వానించారు. ఈ పార్టీకి సల్మాన్‌ను ఆహ్వానించామని, బిజీ షూటింగ్ షెడ్యూల్ దృష్ట్యా సల్మాన్ హాజరవుతారా? లేదా? అనేది అనుమానాస్పదమేనని అమీర్‌ఖాన్ సన్నిహితులు తెలిపారు. ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం పీకే అనే చిత్రం చేస్తున్నారు.
'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. 2014లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు.
బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్, అనుష్క వర్మ కలిసి 'పికే'(Peekay) అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్ ఇదే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications












